‘దేవుడు, దెయ్యం, సైన్స్’పై క్లారిటీ కోసం ‘GST’

by  |
‘దేవుడు, దెయ్యం, సైన్స్’పై క్లారిటీ కోసం ‘GST’
X

దిశ, సినిమా : ‘తోలు బొమ్మల సిత్రాలు’ బ్యానర్‌పై కొమారి జానకి రామ్ దర్శకత్వంలో కొమారి జానయ్య నాయుడు నిర్మిస్తున్న చిత్రం ‘GST( గాడ్ సైతాన్ టెక్నాలజీ)’. తాజాగా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేసిన సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విలేకరుల సమావేశంలో సినిమా గురించి మాట్లాడారు. మంచి సందేశంతో వస్తున్న GST చిత్రం విజయం సాధించాలన్న మంత్రి.. కొమారి జానకిరామ్ మంచి దర్శకుడిగా ఎదగాలని కోరుకోవడంతో పాటు చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ట్రైలర్ లాంచ్ చేసిన మంత్రివర్యులకు దర్శకుడు జానకిరామ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సమాజంలో దేవుడు, దెయ్యంతో పాటు సైన్స్‌పై చాలా అనుమానాలు, అపోహలు ఉన్నాయని, వాటిని నిగ్గు తేల్చేందుకు దమ్మున్న కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని వెల్లడించారు. సినిమాలో లవ్, సెంటిమెంట్, కామెడీ, హార్రర్, సస్పెన్స్‌తో పాటు అంతర్లీనంగా మంచి మెసేజ్‌తో సెప్టెంబర్ 10న థియేటర్స్‌లో విడుదల కాబోతున్న చిత్రాన్ని ఆదరించాలని కోరారు.

కాగా ‘దేవుడు, దెయ్యం, సైన్స్.. ఈ మూడింటిలో ఏది నిజం? ఎవరు గొప్ప అనే విషయంలో ‘GST’ సినిమా వంద శాతం క్లారిఫికేషన్ ఇస్తుందని చిత్ర హీరోల్లో ఒకరైన అశోక్ తెలిపారు. మరో హీరోగా ఆనంద్ నటిస్తున్న చిత్రంలో హీరోయిన్లుగా స్వాతిమండల్, యాంకర్ ఇందుతో పాటు వేదం నాగయ్య తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు యువీ నిరంజన్ సంగీతం అందించారు.


Next Story

Most Viewed