విజయ డెయిరీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

by  |
విజయ డెయిరీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
X

దిశ, న్యూస్‌బ్యూరో: విజయ డెయిరీ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పేర్కొన్నారు. ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న దాదాపు 35,500 అంగన్‌వాడీ కేంద్రాలకు విజయ డెయిరీ ఆధ్వర్యంలో పాల సరఫరాకు సంబంధించి మహిళా, శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి విధివిధానాలపై విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ రంగంలోని విజయ తెలంగాణ డెయిరీ కార్పొరేట్‌ డెయిరీలకు ధీటుగా మార్కెటింగ్‌ వ్యూహాలను అమలు చేయడం ద్వారా ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులో ఉంచే విధంగా అన్నిచర్యలు చేపడుతున్నట్టు మంత్రి తలసాని తెలిపారు. విజయ డెయిరీ ద్వారా వివిధ ప్రభుత్వ సంస్థలకు పాల సరఫరా చేయడమే కాకుండా ఐసీడీఎస్‌ సెంటర్లకు కావాల్సిన 20లక్షల లీటర్ల పాలను సరఫరా చేయడానికి అవసరమైన కార్యాచరణ రూపొందించాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఐసీడీఎస్‌ కేంద్రాలకు అవసరమైన పాలలో 5.5లక్షల లీటర్ల పాలను విజయ డెయిరీ సరఫరా చేస్తుందని, అవసరమైన సిబ్బందిని నియమించేందుకు, పాల సేకరణకు కావాల్సిన సామర్ధ్యాన్ని విజయ డెయిరీ సమకూర్చుకుంటుందని మంత్రి తెలిపారు.



Next Story

Most Viewed