మత్స్యకారుల కుటుంబాలకు రూ. 2 లక్షలు

by Shyam |

<p>దిశ, తెలంగాణ బ్యూరో: మరణించిన మత్స్యకారులకు మంజూరైన ఇన్సూరెన్స్‎ను వారి కుటుంబసభ్యులకు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అందించారు. 105 మంది మత్స్యకారుల కుటుంబాలు రూ.2 లక్షల చొప్పున అందుకున్నారు. శనివారం మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వ హించిన జాతీయ మత్స్యకారుల దినోత్సవ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కులవృత్తులైన చేపలు, గొర్రెలు పెంపకంపై కొంత మంది ఎగతాలిగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధిపై అవగాహన లేకుండా [&hellip;]</p>

మత్స్యకారుల కుటుంబాలకు రూ. 2 లక్షలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మరణించిన మత్స్యకారులకు మంజూరైన ఇన్సూరెన్స్‎ను వారి కుటుంబసభ్యులకు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అందించారు. 105 మంది మత్స్యకారుల కుటుంబాలు రూ.2 లక్షల చొప్పున అందుకున్నారు. శనివారం మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వ హించిన జాతీయ మత్స్యకారుల దినోత్సవ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కులవృత్తులైన చేపలు, గొర్రెలు పెంపకంపై కొంత మంది ఎగతాలిగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధిపై అవగాహన లేకుండా కొందరు రాజకీయ నాయకులు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం వినూత్న పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. నూతనంగా 150 మొబైల్ అవుట్ లెట్‌లు ఏర్పాటు చేసిన మత్స్యకారులకు జీవనోపాధి మార్గాలను అందిస్తున్నామన్నారు. కొర్రమీను రకం చేపల ప్రొడక్షన్ కోసం తగిన చర్యలు చేపడుతున్నామని ప్రకటించారు. ఫెడరేషన్ ద్వారా చేపలు కొనుగోలు చేసే విధంగా పరిశీలన చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బండా ప్రకాశ్ ఇతర అధికారులు, మత్స్యకారులు పాల్గొన్నారు.

Next Story