పత్తిలో తేమ 8 నుంచి 12 శాతం మాత్రమే ఉండాలి: మంత్రి నిరంజన్ రెడ్డి

by  |
పత్తిలో తేమ 8 నుంచి 12 శాతం మాత్రమే ఉండాలి: మంత్రి నిరంజన్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రైతులు నాణ్యతా ప్రమాణాలు పాటించి పంటకు మద్దతు ధర పొందాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు. శుక్రవారం శాసనసభ ఆవరణలోని మంత్రి చాంబర్ లో పంట మద్దతు ధరపై రూపొందించిన వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పత్తిలో తేమ 8 శాతం నుండి 12 శాతం ఉండాలని, 8 శాతానికి లోబడి ఆరు, ఏడు శాతం ఉంటే సీసీఐ ద్వారా బోనస్ ధర పొందవచ్చన్నారు. తేమ 8 శాతం ఉంటే పొడవు పింజ రకానికి మద్దతు ధర క్వింటాలుకు రూ.6025, పింజరకానికి రూ.5925, తేమ 9 శాతం ఉంటే పొడవు పింజ రకానికి మద్దతుధర రూ.5964.75, పింజరకానికి రూ.5865.75, తేమ 10 శాతం ఉంటే పొడవు పింజ రకానికి మద్దతుధర రూ.5904.50, పింజరకానికి రూ.5806.50, తేమ 11 శాతం ఉంటే పొడవు పింజ రకానికి మద్దతుధర రూ.5844.25, పింజరకానికి రూ.5747.25, తేమ 12 శాతం ఉంటే పొడవు పింజ రకానికి మద్దతుధర రూ.5784, పింజరకానికి రూ.5688 అందజేస్తామన్నారు. అదే విధంగా తేమ 6 శాతం ఉంటే పొడవు పింజ రకానికి మద్దతుధర రూ.6025 కి అదనంగా రూ.120.50, పింజ రకానికి రూ.5925కి అదనంగా రూ.118.50, తేమ 7 శాతం ఉంటే పొడవు పింజ రకానికి రూ.6025 కి అదనంగా రూ.60.25, పింజ రకానికి రూ.5925కి అదనంగా రూ.59.25 అదనంగా చెల్లించడం జరుగుతుందని వెల్లడించారు.

వరి ధాన్యం సాధరణ రకానికి క్వింటాలుకు మద్దతుధర రూ.1940, ఏ గ్రేడ్ రకానికి రూ.1960, కందులు రూ.6300, పెసర్లు రూ.7275, వేరుశెనగ రూ.5550, మినుములు రూ.6300, పొద్దుతిరుగుడు రూ.6015, నువ్వులు రూ.7307, జొన్నలు రూ.2738, రూ.2758, సజ్జలు రూ.2250, రాగులు రూ.3377 గా నిర్ణయించినట్లు తెలిపారు.


Next Story