అడ్రస్ లేని పార్టీలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయి : మంత్రి కొడాలి నాని

by  |
అడ్రస్ లేని పార్టీలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయి : మంత్రి కొడాలి నాని
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ బీజేపీపై మంత్రి కొడాలి నాని విరుచుకుపడ్డారు. వినాయకచవితి వేడుకలపై ప్రభుత్వం ఆంక్షలు విధించిందంటూ బీజేపీ ఆందోళనలు చేపట్టడంపై మండిపడ్డారు. దేశవ్యాప్తంగా వినాయకచవితిపై ఎలాంటి ఆంక్షలు ఉన్నాయో, రాష్ట్రంలోనూ అవే ఆంక్షలు అమలు చేస్తున్నామని నాని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అడ్రస్ లేని బీజేపీ విద్వేషాలు రగిల్చేందుకు కుట్రపన్నుతోందని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు విగ్రహాలతోనూ, వినాయకచవితితోనూ రాజకీయం చేయడం షరా మామూలైపోయిందని విమర్శించారు. సీఎం జగన్ అన్ని మతాలను గౌరవిస్తారని చెప్పుకొచ్చారు. అలాంటి జగన్‌ను హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించేందుకు బీజేపీ, టీడీపీలు కుట్రపన్నుతున్నాయని ధ్వజమెత్తారు. వినాయకచవితిపై పండుగపై బీజేపీ, టీడీపీ రాజకీయ లబ్ది పొందాలను చూస్తున్నాయని.. వారికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు.

Next Story

Most Viewed