కల్నల్ సంతోష్ త్యాగం మరువలేనిది : జగదీశ్ రెడ్డి

by Shyam |

<p>దిశ, సూర్యాపేట: కల్నల్ సంతోష్ బాబు త్యాగం మరువలేనిదని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. సంతోశ్ బాబు 38వ జయంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్వీ డిగ్రీ కాలేజీ ఆడిటోరియంలో జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, యువతకు ఆర్మీ, నేవి, పోలీస్ ఉద్యోగాలపై శనివారం అవగాహనా సదస్సు నిర్వహించారు. ఇందుకు మంత్రి జగదీశ్ రెడ్డి హాజరై మాట్లాడారు. సంతోష్ బాబు త్యాగానికి కేంద్రం మహావీర చక్ర అవార్డు ఇవ్వడం గర్వకారణమన్నారు. [&hellip;]</p>

Minister Jagadish Reddy
X

దిశ, సూర్యాపేట: కల్నల్ సంతోష్ బాబు త్యాగం మరువలేనిదని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. సంతోశ్ బాబు 38వ జయంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్వీ డిగ్రీ కాలేజీ ఆడిటోరియంలో జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, యువతకు ఆర్మీ, నేవి, పోలీస్ ఉద్యోగాలపై శనివారం అవగాహనా సదస్సు నిర్వహించారు. ఇందుకు మంత్రి జగదీశ్ రెడ్డి హాజరై మాట్లాడారు. సంతోష్ బాబు త్యాగానికి కేంద్రం మహావీర చక్ర అవార్డు ఇవ్వడం గర్వకారణమన్నారు. అంతకు ముందు సంతోష్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణ, కల్నల్ సంతోష్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Next Story