- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గురువుకు అండగా నిలిచిన మంత్రి జగదీష్ రెడ్డి
by Shyam |
<p>దిశ, నల్గొండ: తనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువుకు కష్టకాలంలో విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డి అండగా నిలిచారు. తనతో పాటు ఎందరికో అక్షరాలు బోధించిన ఉపాధ్యాయుడు ఎంఏ సత్తార్ లాక్ డౌన్ కాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని మంత్రి తెలుసుకున్నారు. వెంటనే పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్న తన గురువు దగ్గరికి స్వయంగా వెళ్లారు. కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి ఆర్థిక సాయం అందించి […]</p>

X
దిశ, నల్గొండ: తనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువుకు కష్టకాలంలో విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డి అండగా నిలిచారు. తనతో పాటు ఎందరికో అక్షరాలు బోధించిన ఉపాధ్యాయుడు ఎంఏ సత్తార్ లాక్ డౌన్ కాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని మంత్రి తెలుసుకున్నారు. వెంటనే పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్న తన గురువు దగ్గరికి స్వయంగా వెళ్లారు. కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి ఆర్థిక సాయం అందించి తన ఔన్నత్యాన్నిచాటుకున్నారు.
Tags: Minister Jagadish Reddy, stood, teacher, helping, nalgonda
Next Story






