- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్ ముందుచూపు.. అమ్మవారి ఆశీస్సుల వల్లే ఇదంతా..!
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో : ఆషాఢమాసం బోనాల జాతర ఉత్సవాల్లో భాగంగా పాతబస్తీలోని లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ బోనాల ఉత్సవాలకు అధిక నిధులు కేటాయించి ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ముందుచూపు, అమ్మవారి దయ వల్ల రాష్ట్రం సుభిక్షంగా ఉందని సకాలంలో వర్షాలు […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : ఆషాఢమాసం బోనాల జాతర ఉత్సవాల్లో భాగంగా పాతబస్తీలోని లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ బోనాల ఉత్సవాలకు అధిక నిధులు కేటాయించి ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ముందుచూపు, అమ్మవారి దయ వల్ల రాష్ట్రం సుభిక్షంగా ఉందని సకాలంలో వర్షాలు కురిసి, పంటలు సమృద్ధిగా పండుతున్నాయన్నారు.
అంతకుముందు మీరాలం మండి శ్రీ మహంకాళేశ్వర అమ్మవారిని, శాలిబండలోని అక్కన్న మాదన్న, అనంతరం చార్మినార్ భాగ్యలక్ష్మి, అంబర్‌పేట్ మహంకాళి అమ్మవార్లను దర్శించి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు.
Next Story






