- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాలేజీనే ఇల్లుగా భావించాడు : హరీశ్ రావు
<p>దిశ, సిద్దిపేట: కళాశాలనే సొంత ఇల్లుగా భావించి, విద్యార్థుల విద్యాభివృద్ధికి నిస్వార్ధంగా సేవలందించిన మర్పడగ క్షేత్ర నిర్వాహకులు డాక్టర్ చెప్పెల హరినాథ శర్మ సేవలు ఎనలేనివని మంత్రి హరీష్ రావు అన్నారు. గజ్వేల్ డిగ్రీ కళాశాల తెలుగు విభాగం అధ్యాపకులుగా పని చేసిన హరినాథ శర్మ ఉద్యోగ విరమణ సందర్భంగా మర్పడగ క్షేత్రంలో ఆదివారం జరిగిన విరమణ సన్మాన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ పాల్గొని మాట్లాడుతూ… నిస్వార్ధంగా విద్యాభివృద్ధికి కృషి చేసి కళాశాలల, […]</p>

దిశ, సిద్దిపేట: కళాశాలనే సొంత ఇల్లుగా భావించి, విద్యార్థుల విద్యాభివృద్ధికి నిస్వార్ధంగా సేవలందించిన మర్పడగ క్షేత్ర నిర్వాహకులు డాక్టర్ చెప్పెల హరినాథ శర్మ సేవలు ఎనలేనివని మంత్రి హరీష్ రావు అన్నారు. గజ్వేల్ డిగ్రీ కళాశాల తెలుగు విభాగం అధ్యాపకులుగా పని చేసిన హరినాథ శర్మ ఉద్యోగ విరమణ సందర్భంగా మర్పడగ క్షేత్రంలో ఆదివారం జరిగిన విరమణ సన్మాన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ పాల్గొని మాట్లాడుతూ… నిస్వార్ధంగా విద్యాభివృద్ధికి కృషి చేసి కళాశాలల, విద్యార్థుల వసతుల కల్పనకు ఆయన నిరంతరం పాటుపడే వ్యక్తి అని మంత్రి అన్నారు.
అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసి వారి సమస్యలతో పాటు కళాశాలల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను నిరంతరం తన దృష్టికి తెచ్చి పరిష్కరించుకునే వాడని మంత్రి తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ఏర్పాటు కోసం సామాజిక కార్యక్రమాలతో పాటు, దైవికంగా చేసిన కృషి మరువలేనిదన్నారు. జీతం డబ్బులతో జీర్ణ దేవాలయాన్ని పునరుద్ధరణ చేసి, తన జీవితాన్ని దేవాలయ అభివృద్ధికి, సమాజాభివృద్ధికి ధార పోసి ఈ ప్రాంత ప్రాశస్త్యానికి కృషి చేసిన వ్యక్తని అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి దేవాలయ అభివృద్ధికి కఠోర దీక్షతో మర్పడగ క్షేత్రాన్ని దినదిన అభివృద్ధి చెందేలా కృషి చేశాడన్నారు. హరి నాథశర్మ ఉద్యోగ విరమణ పొందినప్పటికీ భవిష్యత్తులో ఉన్నతమైన స్థానంలో ఉంటాడని మంత్రి తెలిపారు.






