లోకేష్‌ను చంద్రబాబు నమ్మడం లేదు.. మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

by  |
Minister Anil Kumar Yadav
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్‌పై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. శనివారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. టీడీపీ నేత చనిపోతే ఆ కుటుంబాన్ని లోకేష్ ఎందుకు పరామర్శించలేదని మండిపడ్డారు. లోకేష్‌ను కన్నతండ్రి చంద్రబాబే నమ్మడం లేదని, మరి రాష్ట్ర ప్రజలు ఎలా నమ్ముతారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా తెలుగు దేశం పార్టీ నేతలు నీచమైన, చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని సూచించారు. లోకేష్ నాయకత్వం చూసి సొంత పార్టీ నేతలే భయపడిపోతున్నారని ఎద్దేవా చేశారు.

Next Story

Most Viewed