- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్కడ వైసీపీ జెండా ఎగరడం ఖాయం: మంత్రి అనిల్ కుమార్..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: నెల్లూరు కార్పొరేషన్‌లో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాలు ఇచ్చే బాధ్యత తనదేనని రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. నెల్లూరు కార్పొరేషన్‌లో వైసీపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 54వ డివిజన్ అభ్యర్థి షఫియా బేగంతో కలిసి మంత్రి అనిల్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం మంత్రి అనిల్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ఇస్లాంపేట, భగత్‌సింగ్ కాలనీల్లో ఒక్క ఇల్లు కూడా తొలగించమని హామీ ఇచ్చారు. […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: నెల్లూరు కార్పొరేషన్‌లో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాలు ఇచ్చే బాధ్యత తనదేనని రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. నెల్లూరు కార్పొరేషన్‌లో వైసీపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 54వ డివిజన్ అభ్యర్థి షఫియా బేగంతో కలిసి మంత్రి అనిల్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
అనంతరం మంత్రి అనిల్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ఇస్లాంపేట, భగత్‌సింగ్ కాలనీల్లో ఒక్క ఇల్లు కూడా తొలగించమని హామీ ఇచ్చారు. టీడీపీ, సీపీఎం నేతల దుష్ప్రచారాలను నమ్మొద్దని ఓటర్లకు తెలిపారు. టీడీపీ, సీపీఎం పార్టీలకు ఓటేసినా ఉపయోగం ఉండదని పేర్కొన్నారు. వైసీపీని గెలిపిస్తే అభివృద్ధి వేగంగా జరుగుతుందని మంత్రి అనిల్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
Next Story






