హైదరాబాద్‌ ఏమైనా పాకిస్తాన్‌లో ఉందా: మంత్రి అల్లోల

by  |
హైదరాబాద్‌ ఏమైనా పాకిస్తాన్‌లో ఉందా: మంత్రి అల్లోల
X

దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో మ‌తం పేరుతో ప్ర‌జ‌లను విడ‌గొట్టే ప్ర‌య‌త్నాల‌ను బీజేపీ చేస్తుంద‌ని మంత్రి ఇంద్ర‌కర‌ణ్ రెడ్డి ఆగ్రహాం వ్య‌క్తం చేశారు. ప్రశాంతంగా జీవిస్తున్న నగర ప్రజలను చిందరవందరచేసే కుట్రకు పాల్పడటం బీజేపీకి తగదన్నారు. బంజారాహిల్స్‌లోని రాజ్య‌స‌భ స‌భ్యులు కేకే నివాసంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్‌తో క‌లిసి మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా హైద‌రాబాద్‌పై స‌ర్జిక‌ల్ స్ట్రైక్ అని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ చేసిన వ్యాఖ్య‌ల‌ను మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి త‌ప్పుప‌ట్టారు.

హైద‌రాబాద్ ఏమైనా పాకిస్తాన్ లేక‌ ఆఫ్ఘ‌నిస్తాన్‌లో ఉందా అని అల్లోల ప్ర‌శ్నించారు. దేశ అంత‌ర్భాగంపైనే దాడులు చేస్తారా అని నిల‌దీశారు. ప్రజలను రెచ్చగొట్టి, భయభ్రాంతులకు గురిచేసి ఓట్లు పొందాలని బీజేపీ నాయకులు చూస్తున్నార‌న్నారని ఆయన విమర్శలు చేశారు. ఎన్నికల్లో ఇటువంటి ప్రచారాలు సరికాదని అభివృద్దిపై మాట్లాడి ఓట్లు అడ‌గాల‌ని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హిత‌వు ప‌లికారు.

ఇక వరద బాధితుల అంశం పై స్పందించిన మంత్రి.. డిసెంబ‌ర్ 5వ తేదీ త‌ర్వాత బాధితులంద‌రికీ సహాయం చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. నేరుగా ప్రజలకు డబ్బులు ఇవ్వడానికి అవకాశం లేదన్న కేంద్రమంత్రి కిష‌న్ రెడ్డి రూ. 25 వేల వ‌ర‌ద స‌హాయం ఎలా చేస్తార‌ని ప్ర‌శ్నించారు. బీజేపీ నాయకుల మాట‌ల‌ను ప్ర‌జ‌లు ఎవ్వ‌రూ కూడా న‌మ్మ‌డం లేద‌ని.. గ్రేటర్ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ 100 సీట్లు సాధించ‌డం ఖాయ‌మ‌ని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ధీమా వ్య‌క్తం చేశారు.



Next Story

Most Viewed