ఉద్యోగం లేకపోయినా సంపాదించడం ఎలా?.. జీవితాన్నే మార్చే ఐడియాలివిగో..

by Dishafeatures2 |
ఉద్యోగం లేకపోయినా సంపాదించడం ఎలా?.. జీవితాన్నే మార్చే ఐడియాలివిగో..
X

దిశ, ఫీచర్స్ : కాలం మారింది. ఒకప్పటిలా ఇంటియజమాని మాత్రమే సంపాదిస్తూ.. మిగతావారంతా ఖాళీగా ఉంటే ఇప్పుడు కుదరదు. ఎవరైనా అలా ఉంటున్నారంటే వారు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని నిపుణులు అంటున్నారు. అలాగనీ ప్రతి ఒక్కరికీ జాబ్ మాత్రమే దొరుకుతుందనే గ్యారెంటీ కూడా ఏమీ లేదు. దొరికితే మంచిదే, కానీ దొరకకపోయినా జీవన పోరాటం తప్పదు. కాబట్టి ఏదో కెరీర్ క్రియేట్ చేసుకొని ముందుకు సాగాలి. అందుకోసం అనేక మార్గాలు, ఉపాయాలు ఉన్నాయని ఫైనాన్షియల్ ప్లానర్స్ చెప్తున్నారు. కాస్త ఆలోచించాలే కానీ ఈరోజుల్లో సంపాదించాలనుకునే వారికి అనేక మార్గాలు ఉన్నాయి. కుటుంబాలు సంతోషంగా ఉండాలంటే భర్త మాత్రమే జాబ్ చేయాలని, భార్య ఇంట్లో కూర్చోవాలనే గతకాలపు ఆలోచనలకు చెక్ పెట్టాలి. స్త్రీ, పురుషులు ఇద్దరూ కష్టపడితేనే ఈరోజుల్లో ఆర్థిక ఇబ్బందులు లేకుండా సంతోషంగా జీవించగలుగుతారు. అందుకోసం పెద్ద పెద్ద చదువులు, ఐదంకెల జీతాలే అవసరం లేదు. సొంత కాళ్లపై నిలబడగలిగే నచ్చిన కెరీర్‌ను ఎంచుకొని స్వయం ఉపాధిని పొందవచ్చునని నిపుణులు చెప్తున్నారు. అదెలాగో చూద్దాం.

కుకింగ్ కూడా గొప్ప అవకాశమే..

ఎక్కువ చదువుకోలేదనో, పోటీ ప్రపంచంలో జాబ్ రాలేదనో బాధపడుతూ కూర్చుంటే అక్కడే ఉంటారు. కాబట్టి మీకు వచ్చిన పనితోనే ఎలా సంపాదించాలో కూడా ఆలోచించండి. ఉదాహరణకు మీకు వంట చేయడం బాగా వస్తే అందులోనే సంపాదన ఉందన్న విషయం గుర్తించండి. కుకింగ్ సర్వీస్ కెరీర్‌లోకి ఎంట్రీ ఇవ్వండి. సొంతంగా చిన్న హోటల్ లేదా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సర్వీస్ ప్రారంభించండి. ఇది కూడా ఇష్టం లేకపోతే వివిధ వంటకాలను చేస్తున్నప్పుడు వీడియోలు తీసి యూట్యూబ్, ఇన్ స్టా, వివిధ సైట్లలో అప్‌లోడ్ చేస్తూ కూడా సంపాదించే అవకాశాలు నేడు ఉన్నాయి. లక్షలకొద్దీ ఆదాయం రాకపోయినా మీ కుటుంబానికి ఎంతో కొంత సహాయపడతారు.

ఆసక్తులు, అలవాట్లే ఆదాయంగా..

ఒక్కొక్కరికీ ఒక్కో అంశంపై ఆసక్తి ఉంటుంది. కానీ దానిని ఆదాయంగా మార్చుకోవడం ఎలా అని ఆలోచించేవారు తక్కువ. మీరు కూడా అలాంటి వారైతే ఇక మారండి. మీరు పెద్దగా చదువుకోకపోయినా సరే అల్లికలు, ఎంబ్రాయిడరీ, పెయింటింగ్, టైలరింగ్, డ్యాన్సింగ్ ఇలా ఏ అంశంలోనైనా నిపుణులైతే దానినే మీ కెరీర్‌గా, ఆదాయ వనరుగా మల్చుకోండి. క్లాసెస్ బోధిస్తూ సంపాదించడం ప్రారంభించండి. చదువుకొని ఖాళీగా ఉన్నవారు కూడా ట్యూషన్లు చెప్తూ నెలకు కనీసం 30 వేలదాకా ఆదాయం రాబట్టవచ్చు.

ఫ్రీలాన్సింగ్ చేయండి

మీకు వచ్చిన పనినే ఫ్రీలాన్సింగ్ కెరీర్‌గా మల్చుకోవచ్చు. నేడు అనేక ఆన్‌లైన్ సైట్లు ఇంట్లోనే ఉండి అందించే సేవలను అందాబుటలోకి తెస్తున్నాయి. ఆన్‌లైన్ ట్యూషన్లు, ఆయా కంపెనీల ఉత్పత్తులకు సంబంధించిన కంటెంట్ క్రియేట్ చేయడం, ఆన్ లైన్ షాపింగ్ సైట్లతో టై అప్ అయి ఆదాయం పొందడం వంటివి ఫ్రీలాన్సింగ్ పద్ధతిలోనూ చేయవచ్చు. మీడియా రంగంలో, హాస్పిటాలిటీలో, పబ్లిక్ రిలేటెడ్ సంస్థల్లోనూ ఫ్రీలాన్సింగ్ సేవలు అందించడం ద్వారా ఆదాయం పొందవచ్చు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed