TDP: ‘వై నాట్ 175’గాలి కూటమి వైపు బలంగా వీస్తోంది: ఎంపీ రామ్మోహన్ నాయుడు మాస్ ర్యాగింగ్

by Shiva |
TDP: ‘వై నాట్ 175’గాలి కూటమి వైపు బలంగా వీస్తోంది: ఎంపీ రామ్మోహన్ నాయుడు మాస్ ర్యాగింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ ఏపీలో ప్రధాన పార్టీల ప్రచారం ఓ రేంజ్ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే అధికార వైసీపీ ‘వై నాట్ 175’ అంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే వారికి టీడీపీ నేత ఎంపీ కింజరాపు రమ్మోహన్ నాయుడు కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు రాష్ట్రంలో ‘వై నాట్ 175’ గాలి కూటమి వైపు బలంగా వీస్తోందని. రానున్న ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు డిపాజిట్ కూడా దక్కే అవకాశం లేదంటూ మాస్ ర్యాగింగ్ చేశారు. ఏపీని రాక్షస పాలన నుంచి రక్షించి ప్రజల తరరాతలు మార్చేందుకే టీడీపీ పార్టీలతో పొత్తులు పెట్టుకుందని తెలిపారు. రాబోయే ఉన్నికల్లో ముమ్మాటికీ ప్రతిపక్షమే లేని ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తీను శ్రీకాకుళం నుంచి ఎంపీ బరిలో నిలిచానని, పార్లమెంట్‌కు ముచ్చటగా మూడోసారి వెళ్లడం ఖాయమని తెలిపారు.

Read More..

BREAKING: అదానీ కోసమే పెద్ద నోట్లను రద్దు చేసిన మోడీ: రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

Next Story

Most Viewed