శామ్ పిట్రోడాపై విరుచుకుపడ్డ రాబర్ట్ వాద్రా.. కాస్త బాధ్యతగా ఉండాల్సింది

by Disha Web Desk 17 |
శామ్ పిట్రోడాపై విరుచుకుపడ్డ రాబర్ట్ వాద్రా.. కాస్త బాధ్యతగా ఉండాల్సింది
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల శామ్ పిట్రోడా చేసిన 'జాతి వివక్ష' వ్యాఖ్యలపై వ్యాపారవేత్త, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా విరుచుకుపడ్డారు. ఆయన ఉన్నత విద్యావంతుడు అలాంటి వ్యక్తి ఈ వ్యాఖ్యలు ఎలా చేస్తారని వాద్రా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. శామ్ పిట్రోడా గాంధీ కుటుంబంతో మంచి అనుబంధం కలిగి ఉన్న వారు, ఆయన మాట్లాడే సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉందని వాద్రా అన్నారు. ఆయన చెప్పిన మాటాలను నేను పూర్తిగా విభేదిస్తున్నాను, బక్వాస్ కి హై (అతను చెత్తగా మాట్లాడాడు), రాజీవ్ గాంధీకి శామ్ పిట్రోడా అత్యంత సన్నిహితుడని, ఆయన కాస్త బాధ్యతగా ఉండాల్సిందని రాబర్ట్ వాద్రా తెలిపారు.

ఎన్నికల వేళ రాహుల్, ప్రియాంక కాంగ్రెస్‌‌ను ముందుకు తీసుకెళ్లడానికి తీవ్రంగా కష్ట పడుతున్న సమయంలో శామ్ పిట్రోడా కారణంగా బీజేపీకి అనవసరమైన సమస్యలను లేవనెత్తడానికి దీన్ని అవకాశంగా అందించినట్లయిందని పేర్కొన్నారు. అలాగే, మీరు ఇక్కడికి వచ్చి లోపాలను ఎత్తి చూపుతూ ఈ ప్రభుత్వ తప్పుల గురించి మాట్లాడండి. కానీ మీరు సోఫాలో కూర్చుని మాట్లాడటం సరైనది కాదని శామ్ పిట్రోడా‌పై రాబర్ట్ వాద్రా విమర్శలు చేశారు.

ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ పదవికి శామ్ పిట్రోడా రాజీనామా చేసిన నేపథ్యంలో, ఆయన పదవీ విరమణ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తప్పు అని చెబుతూ ఆయనకు లేఖ రాశానని రాబర్ట్ వాద్రా అన్నారు. జాతి వివక్షపై మాట్లాడుతూ, దాన్ని పట్టించుకోవక్కర్లేదు. అందరం అన్నదమ్ములం, వివిధ భాషలు, వివిధ మతాలు, వివిధ ఆచారాలు, వివిధ ఆహారాన్ని గౌరవిస్తామని తెలిపారు.

Next Story

Most Viewed