- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాటలు జాగ్రత్త.. బాలీవుడ్ మూవీ డైలాగ్స్‌పై ముంబై పోలీస్ నజర్
<p>దిశ, ఫీచర్స్ : సినిమాల్లో మహిళల పట్ల చిన్నచూపు, వ్యతిరేకతను ప్రతిబింబించే సీన్లు, డైలాగులపై బాలీవుడ్ చాలాసార్లు విమర్శలు ఎదుర్కొంది. ఎంటర్‌టైన్‌మెంట్, గ్లామర్ పేరుతో స్త్రీలను కించపరిచే అభ్యంతరకర కంటెంట్ యువతపై ప్రభావం చూపుతుందనడంలో సందేహం లేదు. అయితే ఈ చర్యలను అరికట్టేందుకు ప్రముఖ బాలీవుడ్ చిత్రాల నుంచి అనేక డైలాగ్స్‌ను ట్వీట్ చేసిన ముంబై పోలీస్ సోషల్ మీడియా బృందం.. ‘ప్రతి పదాన్ని ఆలోచనాత్మకంగా ఉపయోగించాలి’ అని ప్రజలను కోరింది. View this post on […]</p>

దిశ, ఫీచర్స్ : సినిమాల్లో మహిళల పట్ల చిన్నచూపు, వ్యతిరేకతను ప్రతిబింబించే సీన్లు, డైలాగులపై బాలీవుడ్ చాలాసార్లు విమర్శలు ఎదుర్కొంది. ఎంటర్‌టైన్‌మెంట్, గ్లామర్ పేరుతో స్త్రీలను కించపరిచే అభ్యంతరకర కంటెంట్ యువతపై ప్రభావం చూపుతుందనడంలో సందేహం లేదు. అయితే ఈ చర్యలను అరికట్టేందుకు ప్రముఖ బాలీవుడ్ చిత్రాల నుంచి అనేక డైలాగ్స్‌ను ట్వీట్ చేసిన ముంబై పోలీస్ సోషల్ మీడియా బృందం.. ‘ప్రతి పదాన్ని ఆలోచనాత్మకంగా ఉపయోగించాలి’ అని ప్రజలను కోరింది.
‘LetsNotNormaliseMisogyny’, ‘MindYourLanguage’, ‘WomenSafety’ అనే హ్యాష్‌ట్యాగ్‌లతో షేర్ చేసిన పోస్ట్‌లో సల్మాన్ ఖాన్ ‘దబాంగ్’, షాహిద్ కపూర్ ‘కబీర్ సింగ్’తో పాటు ‘చష్మే బద్దూర్ (2013)’, ఉజ్దా చమన్’ సినిమాల నుంచి పలు డైలాగ్‌లు ఉన్నాయి. ఇవన్నీ కూడా భిన్న రూపాల్లో స్త్రీలపై వ్యతిరేకతను వ్యక్తంచేసినవే కావడం గమనార్హం. కాగా తమ ఇనిషియేటివ్ ద్వారా కీలక సమస్యను హైలైట్ చేసిన ముంబై పోలీస్ సోషల్ మీడియా బృందాన్ని నెటిజన్లు ప్రశంసిస్తుండగా.. ఆన్‌లైన్‌లో డైలాగ్స్ పోస్టు చేసిన గంటలోనే 30,000 లైక్స్ సంపాదించడం విశేషం. ‘నిజానికి సినిమా అనేది సమాజానికి ప్రతిబింబం వంటిది – ఇవి సమాజం, సినిమాను ప్రతిబింబించాల్సిన కొన్ని (అనేక) డైలాగ్స్. ఇందులో చట్టం జోక్యం చేసుకోవద్దని కోరుకుంటే.. మీ మాటలు, చర్యలను జాగ్రత్తగా ఎంచుకోండి!’ అంటూ ముంబై పోలీస్ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేశారు.
आपण वापरलेला प्रत्येक शब्द हा आधी एक विचार असतो. दैनंदिन जीवनात, तसेच चित्रपटात वापरली जाणारी भाषा आपल्या विचारांचे प्रतिबिंब आहे.
प्रत्येक शब्द विचारपूर्वक वापरा!#LetsNotNormaliseMisogyny#MindYourLanguage#WomenSafety pic.twitter.com/NO41BxJzJM
— Mumbai Police (@MumbaiPolice) September 30, 2021
TAGS :
Slug :






