రానా పేరు పచ్చబొట్టు వేయించుకున్న మిహిక

by  |
రానా పేరు పచ్చబొట్టు వేయించుకున్న మిహిక
X

రానా దగ్గుబాటి .. కథానాయకుడిగా కన్నా మంచి నటుడిగా ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నిస్తున్నారు. బాహుబలిలో భల్లాల దేవుడిగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రానా.. కథ బలంగా ఉంటే అన్ని భాషల్లోనూ నటించేందుకు సిద్ధమని చెప్తుంటారు. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్‌లో ఉన్న ఈ దగ్గుబాటి హీరో.. ఇటేవలే తన ప్రేమను పరిచయం చేసి షాక్ ఇచ్చాడు. కుటుంబ పెద్దల మద్ధతుతో త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న రానా.. తన కాబోయే భార్య మిహిక బజాజ్ నుంచి స్వీట్ సర్‌ప్రైజ్ అందుకున్నాడు. బుధవారం పెద్దలు కలిసి పెళ్లి గురించి మాటాముచ్చట జరపగా, ఇదే రోజున మిహిక.. రానా పేరులోని తొలి అక్షరం, తన పేరులోని మొదటి అక్షరాన్ని లవ్ సింబల్‌తో కలిపి టాటూ వేయించుకుంది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నెటిజన్లు వావ్ వాట్ ఏ లవ్ స్టోరీ అంటున్నారు.

ఇక రానా నటించిన ‘అరణ్య’ సినిమా విడుదల కరోనా కారణంగా వాయిదా పడగా.. పరిస్థితులు చక్కబడ్డాక విడుదల కానుంది. ఇందులో రానా ఆదివాసీ వృద్ధుడిగా కనిపించనున్నారు. ఇక సాయిపల్లవి జంటగా నటిస్తున్న విరాటపర్వంలో నక్సలైట్‌గా కనిపించనున్న రానా.. తనలో మరో కోణాన్ని చూపించనున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed