పెళ్లి చేసుకున్న ప్రేమ జంట.. పొట్టుపొట్టు కొట్టుకున్న కుటుంబ సభ్యులు(వీడియో)

by Vadlamudi Anukaran |   (  Updated:2023-06-13 15:23:34  IST  )

<p>దిశ ప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్ పట్టణంలోని భగత్ నగర్ బాల రక్ష భవన్ ముందు ప్రేమికుల కుటుంబ సభ్యులు కొట్లాడుకున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఘటనా వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లాలో ఓ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రెండు నెలల క్రితం జరిగిన ఈ ప్రేమ పెళ్లికి సంబంధించిన ప్రియురాలు మైనర్ కావడంతో కరీంనగర్ బాల రక్ష భవన్‌కు తరలించారు. అమ్మాయి […]</p>

పెళ్లి చేసుకున్న ప్రేమ జంట.. పొట్టుపొట్టు కొట్టుకున్న కుటుంబ సభ్యులు(వీడియో)
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్ పట్టణంలోని భగత్ నగర్ బాల రక్ష భవన్ ముందు ప్రేమికుల కుటుంబ సభ్యులు కొట్లాడుకున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఘటనా వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లాలో ఓ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

రెండు నెలల క్రితం జరిగిన ఈ ప్రేమ పెళ్లికి సంబంధించిన ప్రియురాలు మైనర్ కావడంతో కరీంనగర్ బాల రక్ష భవన్‌కు తరలించారు. అమ్మాయి మైనర్ కావడంతో ప్రేమికుడిపై కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు. బాల రక్ష భవన్ అధికారుల సంరక్షణలో ఉన్న అమ్మాయి(2 నెలల తర్వాత అంటే ఈరోజు) మేజర్ కావడంతో ఇరు కుటుంబాలను పిలిచి సంబంధిత అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించారు.

ఇరు వర్గాలను సముదాయించేందుకు బాలరక్ష భవన్ అధికారులు ప్రయత్నిస్తున్న క్రమంలో రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇరు వర్గాల ముష్టి యుద్దం బాల రక్షా భవన్ నుంచి భగత్ నగర్ రోడ్డుపైకి చేరింది. సమీపంలోని కొందరు వీరి గొడవను ఫోన్లలో వీడియో తీశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టినట్టు సమాచారం.

Next Story