మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మెహబూబా ముఫ్తీ..

by  |
మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మెహబూబా ముఫ్తీ..
X

దిశ, వెబ్ డెస్క్: జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కేంద్ర ప్రభుత్వం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పీడీపీ అధ్యక్షురాలి మాటలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆజ్ తక్ చర్చలో పాల్గొన్న ఆమె గాంధీల దేశంలో గాడ్సేలను తయారు చేయాలని కేంద్రం చూస్తోందని, కశ్మీర్ లో అశాంతికి కారణం కేంద్ర ప్రభుత్వమే అంటూ వివాదాస్పద వ్యాఖ్యాలు చేసింది. తన తండ్రి కాలంలో కశ్మీరీ పండిట్ లకు సకల అవకాశాలు కల్పించామని చెప్పుకొచ్చారు. నిజానికి మెహబూబా ముఫ్తీ సయ్యద్ సీఎం గా ఉన్నప్పుడే ఎక్కువగా ఉగ్రమూకలు రెచ్చిపోయాయి. వేల మంది సైనికులు నేలకొరిగారు.

కొత్త కాశ్మీర్ గురించి మాట్లాడే నాయకులు.. ఎందుకు కొత్త హిందుస్తాన్ గురించి మాట్లాడరని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. తిరిగి కశ్మీర్ కు ఆర్టికల్ 370 ని తెచ్చుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈశాన్య రాష్ట్రాలలో ప్రత్యేక ఆర్టికల్స్ వర్తించినప్పుడు మాకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు.

Next Story