మేఘా ఆకాష్ క్యూట్ షార్ట్ ఫిల్మ్

by  |
మేఘా ఆకాష్ క్యూట్ షార్ట్ ఫిల్మ్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రెట్టి హీరోయిన్ మేఘా ఆకాష్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్‌కు సూపర్ ట్రీట్ ఇచ్చింది. ‘పేసినాల్ పోతుమే అన్బే’ టైటిల్‌తో షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేసింది. ఈ షార్ట్ ఫిల్మ్‌ను బిందు ఆకాష్ డైరెక్ట్ చేయగా.. గోపీ సుందర్ మ్యూజిక్ సినిమాకు సోల్‌గా నిలిచింది. ప్లాట్‌ఫామ్ టికెట్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ ఫిల్మ్‌కు డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ వాయిస్ ఓవర్ ఇవ్వగా.. మేఘకు జోడీగా సాయి విష్ణు ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ బాగుంది.

లవ్ మ్యారేజ్ చేసుకున్న జంట.. ఇక విడిపోదామనుకుని విడాకులు తీసుకునేందుకు నిర్ణయించుకుంటారు. కానీ అప్పుడే లాక్‌డౌన్ అమలు చేస్తున్నామని, ఎవరూ బయటకెళ్లకూడదని ప్రభుత్వం ప్రకటిస్తుంది. దీంతో ఇద్దరు మళ్లీ ఒకే ఇంట్లో గడపాల్సి వస్తుంది. దీంతో ఇద్దరి మధ్య తగాదాలు పోయి మళ్ళీ ప్రేమ చిగురిస్తుంది. అదే ప్రేమతో ఒక్కటిగా జీవించేందుకు డిసైడ్ అవుతారు. క్యూట్ క్యూట్ సీన్స్‌తో 11 నిమిషాల నిడివితో ఉన్న ఈ షార్ట్ ఫిల్మ్ ఆకట్టుకుంటుండగా.. గోపీ సుందర్ సంగీతం పెద్ద ప్లస్ అయింది.



Next Story

Most Viewed