అన్నీ తాత్కాలిక భవనాలే.. మెగా కంపెనీ వింత వివరణ

by  |
Mega company responding
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: అక్రమ నిర్మాణాలపై మెగా కంపెనీ గమ్మత్తు సమాధానమే చెప్పింది. భూమి లీజు తీసుకుంది వాస్తవమే, తాత్కాలిక భవనాలు కట్టింది నిజమే కానీ వీటికి అనుమతికి సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలకు ఇరిగేషన్ అధికారులను సంప్రదించండి అంటూ ఓ లేఖ ఇచ్చారు.

జగిత్యాల జిల్లా నామాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ లింక్ 2, ప్యాకేజ్ 2లో భాగంగా 1.10 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు అవసరమైన నిర్మాణాలు జరుపుతున్నామని మెగా కంపెనీ అసోసియేట్ జనరల్ మేనేజర్ జె.జనార్దన్ రావు పంచాయితీకి ఓ లేఖ రాశారు. అగ్రిమెంట్ నెంబర్ L.S.A.B. NO .SE/KPC/LMD/KNR/02/2020-2021 ప్రకారం తాము నీటి పారుదల పనులు చేస్తున్నామని వివరించారు. మే 4న గ్రామపంచాయితీ మొదటి సారిగా ఇచ్చిన లేఖ ప్రకారం.. తాము ఆ స్థలాన్ని లీజుకు తీసుకుని తాత్కలిక నిర్మాణం జరిపామని వివరించారు. అగ్రిమెంట్‌లో భాగంగా తాము నిర్మాణాలు జరుపుకున్నామని పంచాయితీ అధికారులు సంప్రదింపులు జరపాలనుకుంటే ఇరిగేషన్ అధికారులతోనే జరపాలని సూచించారు. చొప్పదండిలోని 8వ డివిజన్ ఇరిగేషన్ అండ్ కూడా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌తో కరస్పాండెన్స్ చేసుకోవాలని జనార్దాన్ రావు సూచించారు. అయినప్పటికీ నామాపూర్ పంచాయితీ మరోసారి మెగా కంపెనీకే నోటీసులు ఇచ్చింది. మూడు రోజుల్లో సమాధానం చెప్పాలని లేనట్టయితే కూల్చివేస్తామని స్పష్టం చేసింది.

Mega company

తప్పు చేసిందెవరూ..?

నామాపూర్ వద్ద వ్యవసాయ భూమిలో తాత్కాలిక నిర్మాణాలు జరిపిన మెగా కంపెనీకి గ్రామ పంచాయితీ నోటీసులు ఇస్తే ఇరిగేషన్ అధికారులతో సంప్రదింపులు జరుపుకోవాలని లేఖ ఇవ్వడం విచిత్రంగా ఉంది. వర్క్ అగ్రిమెంట్‌లో భాగంగా క్యాంప్ ఆఫీస్, ఇతరాత్ర నిర్మాణాలు జరిపుకోవాలని ఉన్నప్పటకీ పంచాయితీ అనుమతి లేకుండానే కట్టడం అంతుచిక్కకుండా తయారైంది. తాత్కాలిక భవనాలు కట్టినప్పటికీ పంచాయితీ అనుమతి తీసుకోవాలన్న నిబంధన పంచాయితీరాజ్ చట్టంలో స్పష్టంగా ఉందని గ్రామ సర్పంచ్ కర్ణాకర్ అంటున్నారు. ఈ మేరకే తాము నోటీసులు ఇచ్చామని, నిర్మాణాలు జరిపిన వారికి తాము నోటీసులు ఇస్తాం కానీ సంబందంలేని ఇరిగేషన్ అధికారులతో కరస్పాండెన్స్ చేయడం మాకేం పని అంటున్నారు.

ఎన్వీరాన్‌మెంట్ ఫీ కూడా..

జీఓ ఎంఎస్ 8 ప్రకారం.. 10 వేల స్క్వైర్ ఫీట్‌లు, అంతకు మించిన నిర్మాణాలు జరిపినట్టయితే ఎన్వీరాన్‌మెంట్ ఇంపాక్ట్ ఫీ కూడా వసూలు చేయాలని స్పష్టం చేస్తోంది. ఈ జీఓ ప్రకారం ఒక్కో స్కైర్ ఫీటుకు రూ.3 చొప్పున కూడా వసూలు చేయాలని, ఈ ఫండ్‌ను మైన్స్ అండ్ మినరల్స్ డిపార్ట్ మెంట్ అకౌంట్‌లో జమచేయాలని ఉంది. నామాపూర్‌లో మెగా కంపెనీ 23 ఎకరాలకు పైగా స్థలంలో నిర్మించిన క్యాంప్ ఆఫీసు 10 వేల ఎస్‌ఎఫ్‌టీకి మించి ఉంటే ఎన్వీరాన్‌మెంట్ ఫీ కూడా వసూలు చేయాల్సి ఉంటుంది.


Next Story

Most Viewed