‘వకీల్ సాబ్’ కోసం ఓటీటీ సరిపోదా..!

176

దిశ, సినిమా : ‘బంగారం’ సినిమాలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్న హీరోయిన్ మీరా చోప్రా.. తెలుగు సినిమా ఆఫర్ వస్తే ‘నో’ చెప్పేది లేదని తెలిపింది. ట్విట్టర్‌లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్‌లో పాల్గొన్న భామ.. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చింది. పవన్ ‘వకీల్ సాబ్’ గురించి గ్రేట్ రివ్యూస్ వినడం సంతోషంగా ఉందన్న భామ.. ఎప్పుడెప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతుందా? చూద్దామా? అని వెయిట్ చేస్తున్నాని తెలిపింది.

చైల్డ్‌హుడ్ క్రష్ అనిల్ కపూర్ అని తెలిపిన మీర.. ఇప్పటికీ తనంటే క్రష్ ఉందని, తాను ఎదిగినా అనిల్ కపూర్ మాత్రం ఎప్పటిలాగే ఎవర్‌గ్రీన్ హీరోగా ఉన్నాడని చెప్పింది. ఇక రజనీకాంత్‌ను దేవుడితో పోల్చిన మీరా చోప్రా.. అమితాబ్ బచ్చన్ ఫేవరెట్ ఇండియన్ యాక్టర్ అని తెలిపింది. ఇక కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటున్న చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. కొవిడ్‌ డెడ్లీ వైరస్ అని, ఎవరు కూడా దీన్ని లైట్‌గా తీసుకోకూడదని సూచించింది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..