- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొవిడ్‌తో కాదు.. సరైన వైద్యం అందకే ఇద్దరిని కోల్పోయా : మీరా చోప్రా
by Shyam |
<p>దిశ, సినిమా : హీరోయిన్ మీరా చోప్రా కరోనా కారణంగా పదిరోజుల వ్యవధిలో ఇద్దరు కజిన్స్‌ను కోల్పోయానని ట్వీట్ చేసింది. అయితే వారు కొవిడ్‌తో చనిపోలేదని.. కేవలం సరైన వైద్యసదుపాయం అందుబాటులో లేకపోవడం వల్లే మరణించారని ఆరోపించింది. ఫస్ట్ కజిన్‌కు బెంగళూరులో రెండు రోజుల వరకు ఐసీయూ బెడ్ దొరకక మరణిస్తే, మరొకరు ఆక్సిజన్ అందక చనిపోయారని ఆవేదన వ్యక్తం చేసింది. వారిని రక్షించుకునేందుకు ఏమీ చేయలేకపోయామనే బాధ వెంటాడుతుందని, తర్వాత ఎవరికి ఏం జరుగుతుందోననే భయం […]</p>

X
దిశ, సినిమా : హీరోయిన్ మీరా చోప్రా కరోనా కారణంగా పదిరోజుల వ్యవధిలో ఇద్దరు కజిన్స్‌ను కోల్పోయానని ట్వీట్ చేసింది. అయితే వారు కొవిడ్‌తో చనిపోలేదని.. కేవలం సరైన వైద్యసదుపాయం అందుబాటులో లేకపోవడం వల్లే మరణించారని ఆరోపించింది. ఫస్ట్ కజిన్‌కు బెంగళూరులో రెండు రోజుల వరకు ఐసీయూ బెడ్ దొరకక మరణిస్తే, మరొకరు ఆక్సిజన్ అందక చనిపోయారని ఆవేదన వ్యక్తం చేసింది. వారిని రక్షించుకునేందుకు ఏమీ చేయలేకపోయామనే బాధ వెంటాడుతుందని, తర్వాత ఎవరికి ఏం జరుగుతుందోననే భయం మొదలైందని తెలిపింది. ఒక్కో జీవితం మన చేతుల నుంచి జారిపోతున్నట్లు అనిపిస్తుందన్న మీరా.. ఇలాంటి పరిస్థితి ఇంతకు ముందెప్పుడూ ఎదుర్కోలేదని బాధపడింది.
Next Story






