‘వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి’

by  |
CM KCR
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: కరోనా లాక్‌డౌన్ విపత్కర సమయంలో ఫ్రంట్ లైన్ వర్కర్లైన వైద్య ఆరోగ్య సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ మెడికల్ జేఏసీ, తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు వరంగల్ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ ను మెడికల్ జేఏసీ చైర్మన్ డాక్టర్ బరిగెల రమేష్, కన్వీనర్, తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ పుట్లా శ్రీనివాస్ తదితరులు కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న వైద్య ఆరోగ్య సిబ్బంది అందరికీ 15 శాతం ఇన్సెంటివ్ ఇవ్వాలని, కొత్త జిల్లాలలో డీఎం అండ్ హెచ్ ఓ పోస్టులను భర్తీ చేయాలని, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో పని చేస్తున్న వైద్యులకు పీఆర్సీ అమలు చేయాలని కోరారు.

అంతేకాకుండా డీహెచ్, వైద్య విధాన పరిషత్ ఆధీనంలో విధులు నిర్వహిస్తున్న వారికి స్పెషల్ పీఆర్సీ ఇవ్వాలని, విధులు నిర్వహిస్తూ కరోనా బారినపడి చనిపోయిన వారి కుటుంబాలకు పరిహారం అందించాలని, కనీసం వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులకైనా పీఆర్సీ విడుదల చేయాలనే సమస్యలు సీఎం కు విన్నవించినట్లు వారు వెల్లడించారు. ఇందుకు సీఎం సానుకూలంగా స్పందించారని, త్వరలో తాము సూచించిన సమస్యలన్నీ పరిష్కారమవుతాయని ధీమా వ్యక్తం చేశారు .

Next Story

Most Viewed