కరోనా ఎఫెక్ట్.. మేడారం గుడికి తాళం

by  |
Medaram jathara
X

దిశ‌, మంగ‌పేట: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో సోమవారం నుంచి సమ్కక్క-సారలమ్మల గుడి మూసివేస్తున్నట్లు వనదేవతల పూజారులు ప్రకటించారు. కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పూజారులు వివరించారు. మండ‌మెలిగే జాత‌ర ఫిబ్రవ‌రి 24 నుంచి 27వ తేదీ వ‌ర‌కు జ‌రిగిన విష‌యం తెలిసిందే. శ‌నివారం ఇద్దరు ఎండోమెంట్ అధికారుల‌కు క‌రోనా నిర్ధార‌ణ కావ‌డంతో మెగా హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నారు. ఫ‌లితాల వివ‌రాలు వెల్లడించాల్సి ఉంది. క‌రోనా నేప‌థ్యంలో మార్చి 1 నుంచి 21 వరకు సమ్మక్క-సార‌లమ్మ ఆలయాన్ని మూసివేస్తున్నట్లు పూజారులు స్పష్టం చేశారు. సాధార‌ణంగా మినీ మేడారం జాత‌ర ముగిసిన ప‌దిరోజుల వ‌ర‌కు కూడా భ‌క్తులు పెద్ద సంఖ్యలో అమ్మవార్లను ద‌ర్శించుకునేందుకు వ‌స్తుంటారు. క‌రోనా క‌ల‌క‌లంతో ఈ సారి భ‌క్తుల‌కు నిరాశ ఎదురైంద‌నే చెప్పాలి.


Next Story