బైకును ఢీకొట్టిన లారీ.. ఎంబీబీఎస్ విద్యార్థి మృతి

84

దిశ, భువనగిరి : రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. భువనగిరి నుంచి హైదరాబాద్‌కు ద్విచక్ర వాహనంపై కాలేజీకి వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. యాదాద్రి-భువనగిరి జిల్లా భువనగిరి పట్టణానికి చెందిన వాసం శ్రీనివాస్ మూడవ కుమారుడు వాసం భాను ప్రసాద్(21)హైదరాబాద్‌లోని ఓ కాలేజీలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం కాలేజీకి వెళ్లేందుకని భువనగిరి నుంచి హైదరాబాద్‌కు మోటార్ సైకిల్ పై బయలుదేరాడు.

ఈ క్రమంలోనే భువనగిరి శివారులోని సూర్యవంశీ స్పిన్నింగ్ (పత్తి) మిల్లు సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ బైకును ఢీకొట్టింది. ప్రమాదంలో భాను ప్రసాద్ లారీ టైర్ కింద పడిపోగా తలపగిలి మెదడు బయటపడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ట్రాఫిక్ పోలీసుల సమాచారం మేరకు భువనగిరి పట్టణ ఎస్‌ఐ సుధాకర్ ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మృతుని తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నట్లు తెలిపారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..