ప్రజలు ఇళ్లలోనే ఉండి సహకరించాలి: మేయర్

by  |
ప్రజలు ఇళ్లలోనే ఉండి సహకరించాలి: మేయర్
X

దిశ, న్యూస్‌‌బ్యూరో :

ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం, జీహెచ్ఎంసీ శక్తివంచన లేకుండా పనిచేస్తున్నాయని మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. ప్రజలంతా ఇంట్లోనే ఉండి కరోనా నియంత్రణకు సహకరించాలని కోరారు. ఆయన శుక్రవారం చార్మినార్ జోన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీలో 25 వేలమంది శానిటేషన్, ఎంటమాలజీ, డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రాణాలకు తెగించి కరోనా నివారణకు కృషిచేస్తున్నారని తెలిపారు. కార్మికుల సేవలను గౌరవిస్తూ, సంఘీభావం ప్రకటించేందుకు గాను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అర్వింద్ కుమార్ మాట్లాడుతూ.. నగరాన్ని పరిశుభ్రoగా ఉంచుతూ, కరోనా వ్యాప్తిని అరికట్టడంలో నిరంతరం శ్రమిస్తున్న పారిశుధ్య కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు. పారిశుధ్యం, చెత్త తరలింపు, క్రిమిసంహారకాల స్ప్రేయింగ్‌కు 3,233 వాహనాలను వినియోగిస్తున్నట్లు తెలిపారు. కరోనా నియంత్రణలో నిరంతరం శ్రమిస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బందికి సంఘీభావo తెలుపుతూ చార్మినార్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో బల్దియా కమిషనర్ లోకేష్ కుమార్, ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్, ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, ఓఎస్డీ డి శ్రీనివాస్ రెడ్డి, జోనల్ కమిషనర్ సామ్రాట్ అశోక్ పాల్గొన్నారు.

Tags: Corona, GHMC, Mayor Rammohan, Sanitation staff, Municipal secretary

Next Story

Most Viewed