- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మావోయిస్టుల కలకలం.. ఐదుగురు గ్రామస్తులు కిడ్నాప్
<p>దిశ, భద్రాచలం: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కుంట బ్లాక్‌లోని బటేర్ గ్రామానికి చెందిన ఐదుగురిని మావోయిస్టులు కిడ్నాప్ చేసినట్లు సమాచారం. శుక్రవారం రాత్రి సాయుధ మావోయిస్టులు గ్రామానికి వచ్చి ఐదుగురిని తమ వెంట తీసుకెళ్ళినట్లుగా సమాచారం. ఈ విషయం ఆదివారం వెలుగులోకి వచ్చింది. నక్సల్స్ వద్ద బందీగా ఉన్న వారిని విడిపించడానికి గ్రామస్థులు ప్రయత్నాలు ప్రారంభించారు. వారికి ఏ హాని తలపెట్టకుండా క్షేమంగా విడుదల చేయాలని సర్వ ఆదివాసీ సమాజ్ మావోయిస్టులకు విజ్ఞప్తి చేసింది. ఐదుగురి కిడ్నాప్ సంఘటన […]</p>

దిశ, భద్రాచలం: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కుంట బ్లాక్‌లోని బటేర్ గ్రామానికి చెందిన ఐదుగురిని మావోయిస్టులు కిడ్నాప్ చేసినట్లు సమాచారం. శుక్రవారం రాత్రి సాయుధ మావోయిస్టులు గ్రామానికి వచ్చి ఐదుగురిని తమ వెంట తీసుకెళ్ళినట్లుగా సమాచారం. ఈ విషయం ఆదివారం వెలుగులోకి వచ్చింది. నక్సల్స్ వద్ద బందీగా ఉన్న వారిని విడిపించడానికి గ్రామస్థులు ప్రయత్నాలు ప్రారంభించారు. వారికి ఏ హాని తలపెట్టకుండా క్షేమంగా విడుదల చేయాలని సర్వ ఆదివాసీ సమాజ్ మావోయిస్టులకు విజ్ఞప్తి చేసింది.
ఐదుగురి కిడ్నాప్ సంఘటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. అయితే దీనిని కిడ్నాప్‌గా పోలీసులు ధృవీకరించడం లేదు. సుక్మా ఎస్‌పి సునీల్ శర్మ ఈ ఘటనపై స్పందించారు. గ్రామస్థులను మావోయిస్టులు కిడ్నాప్ చేసినట్లుగా సమాచారం లేదన్నారు. మావోయిస్టులు గ్రామానికి వచ్చి బలవంతంగా సమావేశానికి తీసుకెళ్ళినట్లుగా తమకు తెలిసిందని చెప్పారు.






