‘మాస్టర్’కు పైరసీ దెబ్బ

by  |
‘మాస్టర్’కు పైరసీ దెబ్బ
X

దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ నటుడు విజయ్ హీరోగా నటించిన మాస్టర్ సినిమా విడుదలకు కొద్ది గంటల ముందు పైరసీ బారిన పడింది. మాస్టర్ సినిమా ఆన్‌లైన్‌లో లీకైంది. కరోనా లాక్‌డౌన్ తర్వాత తమిళ సినీ పరిశ్రమలో విడుదల కాబోతున్న భారీ చిత్రం ‘మాస్టర్’ కావడంతో సినీ ప్రముఖులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా రేపు విడుదల కానున్న తరుణంలో సినిమా పైరసీకి గురి కావడంతో తమిళ సినీ పరిశ్రమ షాక్‌కు గురైంది.

సినిమా పైరసీపై ‘మాస్టర్’ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఎమోషనల్ అయ్యారు. ఏడాదిన్నర కష్టాన్ని నాశనం చేయొద్దంటూ వేడుకున్నారు. ఈ మేరకు సోమవారం అర్ధరాత్రి ట్వీట్ చేశారు. ఈ సినిమా మీ ముందుకు తీసుకురావడానికి ఏడాదిన్నర పాటు కష్టపడ్డాం. మీరంతా సినిమాను థియేటర్లలో చూసి ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నా. మాస్టర్ విడుదలకు ఇంకొక్క రోజు మాత్రమే సమయం ఉంది. ఎవరి దగ్గరికైనా సినిమాకు సంబంధించి లీకైన వీడియోలు వస్తే దయచేసి వాటిని ఇతరులకు షేర్ చేయొద్దు. చేతులెత్తి వేడుకుంటున్నా’’ అంటూ లోకేష్ కనగరాజ్ ట్వీట్ చేశారు.

https://twitter.com/Dir_Lokesh/status/1348665784306982918?s=20


Next Story

Most Viewed