కొత్త ఏడాదిలో మెరుగైన అమ్మకాలు సాధిస్తాం: మారుతి సుజుకి!

by  |
maruti suziki
X

దిశ, వెబ్‌డెస్క్: భారత ఆటో పరిశ్రమ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో మెరుగైన వృద్ధిని సాధిస్తుందని దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి అభిప్రాయపడింది. సెమీకండక్టర్ల సరఫరా మెరుగు పడుతుండటంతో ద్రవ్యోల్బణ పరిస్థితులు సానుకూలంగా ఉండటమే దీనికి కారణమని కంపెనీ పేర్కొంది. కొత్త ఏడాది జనవరి-మార్చి మధ్య కంపెనీ స్విఫ్ట్, బలెనో సహా ఎస్‌యూవీ విభాగంలో మొత్తం 47,000 నుంచి 49,000 యూనిట్ల వాహనాలను ఉత్పత్తి చేయనున్నట్టు వెల్లడించింది. పరిస్థితులు మెరుగుపడుతున్న నేపథ్యంలో అత్యధిక వార్షిక వృద్ధి రేటు 15 శాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.

దీంతో మారుతి సుజుకి గత దశాబ్ద కాలంలో భారీ వృద్ధి రేటును సాధించగలదని తెలిపింది. చివరిసారిగా 2010-11 ఆర్థిక సంవత్సరంలో మారుతి సుజుకి 23.5 శాతంతో అత్యధిక వార్షిక వృద్ధిని నమోదు చేసింది. క్రమంగా ఉత్పత్తి మెరుగుపడుతోంది, రానున్న రోజుల్లో ఉత్పత్తిని పెంచేందుకు కంపెనీ తగిన చర్యలు తీసుకుంటోందని మారుతి సుజుకి ప్రతినిధి ఒకరు చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఎనిమిది నెలల్లో మారుతి సుజుకి మొత్తం 1.02 కోట్ల యూనిట్ల వాహనాలను విక్రయించింది. డిసెంబర్ త్రైమాసికంలో మాత్రమే రెండున్నర లక్షలకు పైగా వాహనాలను విక్రయించామని, ప్రస్తుతం నెలలో లక్షన్నర యూనిట్లను అమ్మనున్నట్టు కంపెనీ వెల్లడించింది.


Next Story

Most Viewed