- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తల్లి మృతి.. కొడుక్కి గాయాలు.. అసలేమైంది?
by Batti.Sumithra |
<p>దిశ, హన్మకొండ: వరంగల్ అర్బన్ జిల్లాలో ఓ మహిళ అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. అంతేకాకుండా ఆమె కుమారుడికి తీవ్రగాయాలు కావడంతో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. దీంతో కేసు మరింత కలవరం పెడుతోంది. అసలు ఏం జరిగిందో అన్న విషయం అంతుపట్టకుండా ఉంది. హన్మకొండ టైలర్ స్ట్రీట్‌లో నివాసం ఉంటున్న దొరమ్ శారద (35) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె తలకు బలమైన గాయం అయినట్లు పోలీసులు గుర్తించారు. ఇదే సమయంలో మృతురాలి కుమారుడు గాయాలతో […]</p>

X
దిశ, హన్మకొండ: వరంగల్ అర్బన్ జిల్లాలో ఓ మహిళ అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. అంతేకాకుండా ఆమె కుమారుడికి తీవ్రగాయాలు కావడంతో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. దీంతో కేసు మరింత కలవరం పెడుతోంది. అసలు ఏం జరిగిందో అన్న విషయం అంతుపట్టకుండా ఉంది.
హన్మకొండ టైలర్ స్ట్రీట్‌లో నివాసం ఉంటున్న దొరమ్ శారద (35) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె తలకు బలమైన గాయం అయినట్లు పోలీసులు గుర్తించారు. ఇదే సమయంలో మృతురాలి కుమారుడు గాయాలతో పడి ఉండగా.. హాస్పిటల్‌కి తరలించారు. శారదకు భర్త నరేశ్ ఇద్దరు సంతానం. అయితే కూతురు పెద్దమ్మ వాళ్ల ఇంటికెళ్లినట్లు పోలీసులు తెలిపారు. మృతిరాలి తలపై గాయం కావడంతో స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు విచారణ చేపట్టారు.
Next Story






