దారుణం.. ఓ వ్యక్తి గొంతుకోసిన మావోయిస్టులు

by Batti.Sumithra |

<p>దిశ, భద్రాచలం: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. కాంకేర్ జిల్లా తాడోకి పోలీస్‌స్టేషన్ పరిధిలోని చింగ్‌నార్ గ్రామానికి చెందిన లచ్చు మార్కమ్‌ని గొంతుకోసి హత్య చేశారు. సోమవారం ఉదయం లచ్చు మార్కమ్ మృతదేహాన్ని అడవిలో గుర్తించిన గ్రామస్థులు పోలీసులకి సమాచారం ఇచ్చారు. అది తీవ్ర మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో మృతదేహాన్ని గ్రామస్థుల ద్వారా తెప్పించడానికి తాడోకి‌‌ పోలీసులు ఏర్పాట్లు చేశారు.‌ ఈనెల 21న లచ్చు మార్కమ్‌ని ఇంటినుంచి మావోయిస్టులు తీసుకెళ్ళినట్లుగా సమాచారం. [&hellip;]</p>

Maoist encounter
X

దిశ, భద్రాచలం: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. కాంకేర్ జిల్లా తాడోకి పోలీస్‌స్టేషన్ పరిధిలోని చింగ్‌నార్ గ్రామానికి చెందిన లచ్చు మార్కమ్‌ని గొంతుకోసి హత్య చేశారు. సోమవారం ఉదయం లచ్చు మార్కమ్ మృతదేహాన్ని అడవిలో గుర్తించిన గ్రామస్థులు పోలీసులకి సమాచారం ఇచ్చారు. అది తీవ్ర మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో మృతదేహాన్ని గ్రామస్థుల ద్వారా తెప్పించడానికి తాడోకి‌‌ పోలీసులు ఏర్పాట్లు చేశారు.‌ ఈనెల 21న లచ్చు మార్కమ్‌ని ఇంటినుంచి మావోయిస్టులు తీసుకెళ్ళినట్లుగా సమాచారం. అతని విడుదల కోసం కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ప్రయత్నిస్తుండగా ఈ హత్య వెలుగుచూసి గ్రామంలో విషాదం నింపింది. ఈ హత్య సంఘటన తరువాత ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది.

Next Story