- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మావోయిస్ట్ సానుభూతిపరుల అరెస్ట్
by Shyam |
<p>దిశ, వరంగల్: భీమదేవరపల్లి మండలం మాణిక్యాపూర్‌కు చెందిన ముగ్గురు మావోయిస్టు సానుభూతి పరులను ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి విప్లవ సాహిత్యం, డైనమోలు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు కాజీపేట ఏసీపీ రవీంద్ర కుమార్ మీడియాకు వెల్లడించారు. ప్రభుత్వ నిషేధిత మావోయిస్టు నేతల పిలుపు మేరకు పార్టీని బలోపేతం చేసేందుకు యువతను దారి మళ్లించి ఉద్యమంలో చేర్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి.ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందడంతో ఉగ్గె శంకర్, గొల్లు ప్రవీణ్ కుమార్, […]</p>

X
దిశ, వరంగల్: భీమదేవరపల్లి మండలం మాణిక్యాపూర్‌కు చెందిన ముగ్గురు మావోయిస్టు సానుభూతి పరులను ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి విప్లవ సాహిత్యం, డైనమోలు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు కాజీపేట ఏసీపీ రవీంద్ర కుమార్ మీడియాకు వెల్లడించారు. ప్రభుత్వ నిషేధిత మావోయిస్టు నేతల పిలుపు మేరకు పార్టీని బలోపేతం చేసేందుకు యువతను దారి మళ్లించి ఉద్యమంలో చేర్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి.ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందడంతో ఉగ్గె శంకర్, గొల్లు ప్రవీణ్ కుమార్, కొత్తూరి ఇంద్రసేనను ఎల్కతుర్తి సీఐ శ్రీనివాస్, జి.ములుకనూరు ఎస్సై సూరి, వంగర ఎస్సై గంజి స్వప్న సిబ్బందితో కలిసి మాణిక్యాపూర్ గ్రామ శివారులోని చెరువు కట్ట వద్ద అదుపులోకి తీసుకున్నారు.ఈ మేరకు కేసు నమోదు చేసి వారిని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు.
Next Story






