మావోయిస్టు ప్లాటూన్ దళ సభ్యుడు అరెస్ట్

by  |
మావోయిస్టు ప్లాటూన్ దళ సభ్యుడు అరెస్ట్
X

దిశ, భద్రాచలం : ప్రభుత్వ నిషేధిత మావోయిస్డు పార్టీ ప్లాటూన్ సభ్యుడిని భద్రాచలం పోలీసులు అరెస్డు చేశారు.‌ ఏఎస్పీ రాజేష్‌ చంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాచలంలో సీఐ స్వామి, ట్రాఫిక్ ఎస్ఐ సురేష్ సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ చేస్తుండగా.. రాజుపేట కాలనీ వద్ద రోడ్డుపై ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో అతడిని పట్టుకొని బ్యాగ్ తనిఖీ చేయగా అందులో పేలుడు పదార్ధాలను గుర్తించారు. ఈ మేరకు అతడిని అదుపులోకి తీసుకొని విచారించగాఛత్తీస్‌గడ్ రాష్ట్రం సుకుమా జిల్లా పట్టపాడుకు చెందిన కలుమ జోగగా గుర్తించినట్లు ఏఎస్పీ వెల్లడించారు.

సీపీఐ మావోయిస్టు భావజాలానికి ఆకర్షితుడై మొదట కలుమ దూల ఆధ్వర్యంలో బాలల సంఘంలో చేరి 2007 నుంచి 2014 వరకు పని చేశాడని తెలిపారు. అనంతరం మడకం సోమా ఆధ్వర్యంలో జన మిలీషియాలో చేరి 2014 నుంచి 2016 వరకు పనిచేసి.. 2016 నుంచి 2017 వరకు కరకు జోగ ఆధ్వర్యంలో భూంకాల్ మిలీషియాలో చేరారు. 2017లో నిషేధిత సీపీఐ మావోయిస్టు 8వ ప్లాటూన్‌లో దూది మాస ఆధ్వర్యంలో చేరి ప్రస్తుతం అదే దళంలో పీపీసీఎం/ ఏసీఎం ర్యాంకులో పనిచేస్తున్నట్లు తెలిపారు. కలుమ జోగ పలు ప్రధాన కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. నిందితుడి నుంచి పేలుడు పదార్థాలు, ఐదు డిటోనేటర్లు, 50 జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఏఎస్‌పీ రాజేష్‌ చంద్ర తెలిపారు.

Advertisement
Next Story

Most Viewed