మణుగూరు ఏఎస్పీ సేవలకు సలాం.. గుత్తికోయలకు సాయం

by  |
Manuguru-ASP-Dr.-Shabarish
X

దిశ, మణుగూరు: పోలీసుల్లో కఠినత్వమే కాదు.. మానవత్వమూ ఉందని మణుగూరు ఏఎస్పీ డాక్టర్ శబరీష్ నిరూపించాడు. గుత్తికోయల అవసరాలు తీరుస్తూ.. శభాష్ అనిపించుకుంటున్నారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం అమరవరం గ్రామపంచాయతీలోని తీర్లపురం గ్రామాన్ని ఏఎస్పీ శబరీష్ సందర్శించారు. ఈ సందర్భంగా గుత్తికోయల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కొద్దిసేపు చిన్నపిల్లలతో సరదాగా మాట్లడి, పిల్లలకు చాక్లెట్లు, బిస్కెట్లు అందజేశారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అడవి ప్రాంతంలో జీవించే ప్రజలు వాగునీటిని తాగి అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు, అందరూ ఆరోగ్యంగా ఉండాలన్న సంకల్పంతో గుత్తికోయలందరికీ వాటర్ ఫిల్టర్‌లను పంపిణీ చేశామని తెలిపారు. వర్షాకాలంలో అంటూ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

వర్షాలకు వాగులు, వంకలు పొంగి రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడే అవకాశం ఉందని గుర్తుచేశారు. ఎవరికైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే మాకు(పోలీసులకు) సమాచారం అందిస్తే వైద్య బృందాలను ఏర్పాటు చేసి, వైద్య సేవలు అందించేందుకు పోలీసులు అన్ని విధాలా సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అటవీ ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడుళ్ల బయ్యారం సీఐ దోమల రమేష్, ఎస్సై సూరి, సివిల్, స్పెషల్ పార్టీ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed