- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాపో మెయింటైన్ చేస్తున్న విజయ్, మనోజ్!
<p>దిశ, సినిమా : మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, బాలీవుడ్ యాక్టర్ మనోజ్ బాజ్‌పాయ్.. ముంబైలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో కలుసుకున్నారే తప్ప, ఇప్పటివరకు కలిసి పనిచేయలేదు. కానీ వీరిద్దరి మధ్య మంచి రిలేషన్ ఉన్నట్టు తెలుస్తోంది. మనోజ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్‌ను చెన్నైలో చిత్రీకరించిన సంగతి తెలిసిందే. అక్కడి షూటింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను తాజా ఇంటర్వ్యూలో వెల్లడించిన బాలీవుడ్ యాక్టర్.. విజయ్‌తో పాటు పలువురు కోలీవుడ్ సెలబ్రిటీలను కలిసినట్టు తెలిపాడు. […]</p>

దిశ, సినిమా : మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, బాలీవుడ్ యాక్టర్ మనోజ్ బాజ్‌పాయ్.. ముంబైలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో కలుసుకున్నారే తప్ప, ఇప్పటివరకు కలిసి పనిచేయలేదు. కానీ వీరిద్దరి మధ్య మంచి రిలేషన్ ఉన్నట్టు తెలుస్తోంది. మనోజ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్‌ను చెన్నైలో చిత్రీకరించిన సంగతి తెలిసిందే. అక్కడి షూటింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను తాజా ఇంటర్వ్యూలో వెల్లడించిన బాలీవుడ్ యాక్టర్.. విజయ్‌తో పాటు పలువురు కోలీవుడ్ సెలబ్రిటీలను కలిసినట్టు తెలిపాడు. షూటింగ్ నిమిత్తం చెన్నై చేరుకోగానే విజయ్‌కు కాల్ చేసి పిలిచానని, తను రాత్రి 12 గంటలకు షూట్ లొకేషన్‌కు వచ్చాడని చెప్పాడు. ఆ రోజు చాలా విషయాల గురించి మాట్లాడుకుంటూ టైమ్ స్పెండ్ చేశామని పేర్కొన్నాడు. చెన్నైలోని ఫిల్మ్ మేకర్స్, యాక్టర్స్ గురించి తెలుసుకోవడంతో పాటు ఇరుకు సందుల్లో నుంచి వెళ్లడం ఇష్టమన్న మనోజ్.. తను రియల్ చెన్నైని చూడాలనుకుంటానని తెలిపాడు. ప్రస్తుతం విజయ్ సేతుపతి.. తుగ్లక్ దర్బార్, లాభం, ముంబైకర్ తదితర చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.
See what @BajpayeeManoj from #FamilyMan has to say about our #MakkalSelvan @VijaySethuOffl.
Watch the full interview on :https://t.co/edWL3RzxsC#VijaySethupathi pic.twitter.com/zERk2o6nk1
— Malaysia Vijay Sethupathi Fan Club (@MakkalSelvanMFC) June 15, 2021






