బాజ్‌పాయ్ ప్రశ్నకు న్యూజిలాండ్ కెప్టెన్ అదిరిపోయే ఆన్సర్.. వీడియో వైరల్

by  |
Manoj Bajpayee
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ యాక్టర్ మనోజ్ బాజ్‌పాయ్, కివీస్‌ క్రికెట్ జట్టు కెప్టెన్‌ కేన్ విలియమ్సన్‌ మధ్య తాజాగా ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. ఇందులో భాగంగా మనోజ్‌ వేసిన ఓ ప్రశ్నకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన కేన్ మామ.. అభిమానులను అలరించడం విశేషం. అసలు విషయానికొస్తే.. అమెజాన్ ప్రైమ్ వేదికగా కివీస్‌ కెప్టెన్‌తో క్రికెట్‌, సినిమా, వెబ్‌ సిరీస్‌ల గురించి చర్చించిన మనోజ్.. మీకు నచ్చిన వెబ్‌ సిరీస్‌ ఏది? అని అడిగాడు. దీనికి ‘మిర్జాపూర్’ అని బదులిచ్చిన కేన్.. ఈ సిరీస్ రెండు సీజన్లను చూసేశానని, మూడో పార్ట్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పాడు. తను నటించిన ‘ఫ్యామిలీ మ్యాన్’ పేరు చెబుతాడని ఎక్స్‌పెక్ట్ చేసిన బాజ్‌పాయ్.. విలియమ్సన్ ఆన్సర్‌తో అవాక్కై ‘బై కేన్‌’ అంటూ ముగించాడు. ఈ వీడియోను అమెజాన్ ప్రైమ్ సోషల్ మీడియాలో విడుదల చేయగా ప్రస్తుతం వైరల్ అవుతోంది.



Next Story

Most Viewed