రాష్ట్ర ప్రభుత్వాలకు సాయం చేస్తాం: మోడీ

by Vadlamudi Anukaran |

<p>దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 మన సహనాన్ని పరీక్షిస్తోందని ప్రధాని మోడీ అన్నారు. మన్ కీ బాత్‌లో ప్రసంగించిన దేశ ప్రధాని కరోనా వైరస్ నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. కరోనా మొదటి దశను విజయవంతంగా ఎదుర్కొన్నామని.. కానీ, రెండో దశ వేగంగా వ్యాపిస్తోందన్నారు. అందుకే కరోనా వ్యా్ప్తి నివారణకు నిపుణులతో ప్రత్యేకంగా సమావేశమయ్యామని గుర్తు చేశారు. ఈ సమావేశంలో ఆక్సిజన్, ఫార్మా కంపెనీల ప్రతినిధులతో చర్చించామని స్పష్టం చేశారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వైద్యులు వైరస్ నివారణపై [&hellip;]</p>

రాష్ట్ర ప్రభుత్వాలకు సాయం చేస్తాం: మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 మన సహనాన్ని పరీక్షిస్తోందని ప్రధాని మోడీ అన్నారు. మన్ కీ బాత్‌లో ప్రసంగించిన దేశ ప్రధాని కరోనా వైరస్ నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. కరోనా మొదటి దశను విజయవంతంగా ఎదుర్కొన్నామని.. కానీ, రెండో దశ వేగంగా వ్యాపిస్తోందన్నారు. అందుకే కరోనా వ్యా్ప్తి నివారణకు నిపుణులతో ప్రత్యేకంగా సమావేశమయ్యామని గుర్తు చేశారు. ఈ సమావేశంలో ఆక్సిజన్, ఫార్మా కంపెనీల ప్రతినిధులతో చర్చించామని స్పష్టం చేశారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వైద్యులు వైరస్ నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. దేశంలో 90 శాతం రోగులు చికిత్స లేకుండానే కోలుకుంటున్నారని.. వ్యాక్సిన్‌పై వదంతులు నమ్మవద్దని ప్రధాని పేర్కొన్నారు. అర్హులైన వారందరూ వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. అందుకే రాష్ట్రాలకు ఉచితంగా కొవిడ్ వ్యాక్సిన్ అందజేస్తున్నామన్నారు. ఉచిత వ్యాక్సినేషన్ అనేది దేశమంతటా కొనసాగుతోందని.. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రధాని మోడీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Next Story