పెళ్లి రోజే నా భార్య ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకుంటానంటోంది సార్

by  |
పెళ్లి రోజే నా భార్య ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకుంటానంటోంది సార్
X

దిశ, వెబ్‌డెస్క్: అదో ఫ్యామిలీ కోర్ట్. అప్పుడే కోర్ట్ లోపలికి జడ్జ్ రావడంతో అంతా నిశబ్ధం. ఓ వ్యక్తి బోనులోపలికి వచ్చి. జడ్జిగారూ నాభార్య నుంచి నాకు విడాకులు కావాలంటూ కన్నీటి పర్యంతరమయ్యాడు. దీంతో జడ్జ్‌గారు ఎందుకయ్యా ఏడుస్తావ్. ఏం జరిగింది. నీభార్యకు విడాకులు ఎందుకు ఇవ్వాలని అనుకుంటున్నావ్ అంటూ ఎదురు ప్రశ్నించారు.

ఇద్దరం కలిసి టెంపుల్ కు వెళ్లాం. టెంపుల్ లోపలికి రాకుండా బయటే నిలబడింది. ఎందుకని ప్రశ్నిస్తే నెలసరి అంటూ నన్ను మోసం చేసింది. ఆమె మాటమీద నాకు నమ్మకం పోయింది నాకు విడాకులు కావాలని కోరాడు. అందుకు జడ్జ్‌గారు ఏమయ్యా నెలసరి గురించి చెప్పలేదని భార్యకు ఎవరైనా విడాకులిస్తారా..? బుద్ధిలేదా అంటూ చివాట్లు పెట్టారు.

దీంతో కంగుతిన్న భర్త సార్ నాకు ఈ ఏడాది జనవరిలో పెళ్లైంది. ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నా. నా భార్య ప్రైవేట్ స్కూల్ టీచర్ గా పనిచేస్తుంది. కరోనా కష్టకాలం. అసలే చాలీచాలని జీతంతో గుట్టుగా సంసారాన్ని నెట్టుకొస్తున్నా. వచ్చేది తక్కువ జీతమైనా సరే నా భార్యను మహరాణిలా చూసుకోవాలని అనుకున్నా.

రోజూ సాయంత్రం మూర మల్లెపూలు, వారానికో సినిమా, నెలకోసారి పిక్నిక్, సంవత్సరానికొక ట్రిప్‌లతో లైఫ్ ను ఎంజాయ్ చేద్దామనుకున్నా. కానీ నా భార్య మాత్రం గొంతెమ్మ కోరికలతో నన్ను కాల్చుకొని తింటుంది. నా తల్లిదండ్రుల్ని మా అన్నయ్య చూసుకుంటున్నాడు. వాళ్ల ఖర్చులకి డబ్బులివొద్దని అంటుంది. పైగా నెల ఖర్చులకు రూ.5వేలు ఇవ్వాలంట. అదీ చాలదన్నట్లు వాషింగ్ మిషన్, టీవీ, ఏసీలు కావాలంట. ఇవ్వన్ని నేను ఎలా కొనివ్వగలను. నా దగ్గర అంత డబ్బులేదని భార్యకు నచ్చచెప్పినా ఫలితం లేకుండా పోయింది.

కోరికలు తీర్చలేదని ఎప్పుడు పడితే అప్పుడు చెప్పా పెట్టకుండా పుట్టింటికి పోయేది. అయినా సరే నా భార్యతో కలిసి ఉండేందుకు నచ్చచెప్పి ఇంటికి తీసుకొచ్చా. పద్దతి మారలేదు. తను అడిగినవి చేయకపోతే పెళ్లి రోజు 10 మందితో ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకుంటానని బెదిరించింది. ఒక రోజైతే టెర్రస్‌ మీద నుంచి దూకి చనిపోతానని భయపెట్టింది. ఆమెతో వేగలేనని ఎలాగైనా విడాకులు ఇప్పించమని భర్త ఫ్యామిలీ కోర్ట్ జడ్జ్‌ని కోరాడు. గుజరాత్‌లోని వడోదరలోని ఫ్యామిలీ కోర్ట్ లో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Next Story