బాస్కెట్‌బాల్ డ్రిబ్లింగ్.. రికార్డ్ రన్నింగ్!

by  |
బాస్కెట్‌బాల్ డ్రిబ్లింగ్.. రికార్డ్ రన్నింగ్!
X

దిశ, వెబ్‌డెస్క్ : బాస్కెట్‌బాల్‌‌‌, రన్నింగ్ మనందరికీ పరిచయమున్న క్రీడలే. అంతేకాదు వీటిని విడివిడిగా ఆడతారని కూడా తెలుసు. కానీ ఇక్క డ ఓ యువకుడు మాత్రం ఈ రెండింటిని కలిపి గిన్నిస్ రికార్డు సాధించడం విశేషం. అదెలా అనుకుంటున్నారా? మీరే తెలుసుకోండి.

పాకిస్థా‌న్‌కు చెందిన అజ్మ‌త్ ఖాన్ అనే అథ్లెట్ పరుగెత్తడంలో తనకు తానే సాటి అని ఇప్పటికే ఎన్నోసార్లు ప్రూవ్ చేసుకున్నాడు. తాను మామూలుగా రన్నింగ్ చేయడమే కాకుండా, బాస్కెట్‌బాల్‌ను డ్రిబ్లింగ్ చేస్తూ పరుగెత్తడాన్ని తీవ్రంగా ప్రాక్టీస్ చేశాడు. దీంతో ఇప్పుడు చిరుతలా పరుగులు పెడుతూ, అదే సమయంలో బాస్కెట్‌బాల్‌ను డ్రిబ్లింగ్ చేస్తూ కేవలం 6 నిమిషాల 1 సెక‌నులో 1.6 కిలోమీటర్లు (మైల్) దూరాన్ని పూర్తి చేసి గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకున్నాడు. అజ్మత్ ఖాన్ ఇలాంటి ఘ‌న‌త సాధించ‌డం ఇదేం మొద‌టిసారి కాదు. 2019 మార్చిలో 44 నిమిషాల 19 సెకండ్ల‌ సమయంలో 10 కి.మీ. పరుగును వేగంగా పూర్తి చేసిన రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు.

అజ్మత్.. ఎక్కువగా లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ కాంపిటీషన్లలో పాల్గొంటుంటాడు. ఈ క్రమంలో అతడు యూఏఈ వ్యాప్తంగా అన్ని ప్రధాన ఈవెంట్లలోనూ పార్టిసిపేట్ చేశాడు. 3 కిలోమీటర్ల పరుగు పందెం నుంచి 42 కిలోమీటర్ల రేస్ కాంపిటీషన్ల వరకు అన్నింట్లోనూ పాల్గొన్నాడు. వాస్తవానికి పాకిస్థాన్‌లో పుట్టిన అజ్మత్.. చిన్నప్పటి నుంచి దుబాయ్‌లోనే ఉంటున్నాడు.

Next Story

Most Viewed