భార్యకు కరోనా సోకిందని భర్త ఆత్మహత్య

by  |
భార్యకు కరోనా సోకిందని భర్త ఆత్మహత్య
X

దిశ ఏపీ బ్యూరో: విజయనగరం జిల్లాలోని పార్వతీపురంలో భార్యకు కరోనా పాజిటివ్ వచ్చిందని మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. స్థానిక బెలగాంకి చెందిన వ్యక్తి భార్య జలుబు, జ్వరంతో బాధపడుతుండడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ కరోనా పరీక్ష చేయడంతో ఆమెకు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. దీనిని తట్టుకోలేకపోయిన భర్త రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story