హైదరాబాద్‌లో ఘోరం.. బీటెక్ యువతిని రెండేళ్లుగా వాడుకుంటూ..

by  |

దిశ, వెబ్ డెస్క్: ఓ యువతిని ప్రేమించి, రెండేళ్లపాటు ఆమెతో చెట్టాపట్టాలేసుకుని తిరిగి, ఆ తర్వాత ఇప్పుడు నువ్వు నాకు నచ్చడంలేదంటూ యువకుడు మోసం చేసిన ఘటన రాష్ట్ర రాజధానిలో చోటు చేసుకుంది. తెలిసిన సమాచారం మేరకు.. హయత్ నగర్ కు చెందిన ఓ యువతి ప్రస్తుతం బీటెక్ చదువుతోంది. చంపాపేట్ కు చెందిన ఓ యువకుడు ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అయితే, వీరిద్దరు గత రెండేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఇద్దరు కలిసి పార్కులు, సినిమాలు ఇలా ఇష్టం వచ్చినట్లు తిరిగేశారు. అయితే, ఆ యువతి అతడిని పెళ్లి చేసుకోవాలని కోరిందని.. అందుకు అతను నో చెప్పడంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించినట్లు తెలిసింది. తనని రెండేళ్లపాటు అతని వెంట తిప్పుకుని పెళ్లి చేసుకోమంటే నిరాకరిస్తున్నాడని ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే, ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed