లక్కీ ఫెలో..160 లాటరీ టికెట్లు గెలిచాడు

by  |
లక్కీ ఫెలో..160 లాటరీ టికెట్లు గెలిచాడు
X

దిశ, వెబ్‌డెస్క్ : అదృష్టం వరిస్తే లాటరీ తగులుతుందేమో గానీ, అదృష్ట దేవత తలుపు తడితే మాత్రం.. ఎన్ని లాటరీ టికెట్లు తీస్తే, అన్నీ తగులుతాయి. అందుకు అమెరికాలోని వర్జీనియాకు చెందిన క్వామ్ క్రాస్‌ నిదర్శనం. సాధారణంగా పది, పదిహేను లాటరీ టికెట్లు కొని అందులో ఒక్కటి తగిలినా చాలనుకుంటాం. కానీ క్రాస్‌ 160 లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తే, అన్నింటికీ ప్రైజ్ మనీ గెలవడం విశేషం.

రోస్లిన్ సునోకో సంస్థ నుంచి పిక్ ఫోర్ లాటరీ కోసం160 టిక్కెట్లను కొనుగోలు చేసిన క్వామ్ క్రాస్.. ఆ టిక్కెట్లన్నింటినీ 7314 సిరీస్‌లోనే తీసుకున్నాడు. తాజాగా ఆ లాటరీకి సంబంధించి డ్రా తీయగా క్రాస్ కొన్న టికెట్లన్నింటికీ లాటరీ వరించింది. ఈ మేరకు ఒక్కో టికెట్‌కు 5 వేల డాలర్ల రూపాయలు రానుండగా, మొత్తంగా 8 లక్షల డాలర్ల (రూ.5.89 కోట్లు )ను గెలుచుకున్నాడు. ‘నాకు లాటరీ వచ్చిందని మొదట తెలియగానే, ఇది నిజమేనా అనిపించింది, దాదాపు 82 సార్లు క్రాస్ చెక్ చేసుకున్నాక గానీ నాకు లాటరీ వచ్చిందని నమ్మలేదు. ఈ డబ్బుతో ఏం చేయాలో ఇంకా నేను నిర్ణయించుకోలేదు’ అని క్రాస్ తెలిపాడు.

అయితే ‘క్రాస్’కే కాకుండా గతంలోనూ కొందరికి ఇలాంటి లక్కీ లాటరీస్ తగిలాయి. అమెరికాకు చెందిన రేమండ్ హారింగ్టన్‌కు కూడా ఇదే లాటరీ డ్రాలో తాను కొన్న 25 లాటరీ టికెట్లకు లాటరీ వరించింది. అలాగే మిచిగాన్‌కు చెందిన ‘సమీర్ మజామోమే’కు సైతం తను కొన్న రెండు టికెట్లకు లాటరీ తగిలింది.


Next Story