- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భూతగాదాలతో వ్యక్తి దారుణ హత్య
<p>దిశ, నర్సాపూర్: భూతగాదాలతో ముగ్గురు అన్నదమ్ములపై దాడి చేయడంతో ఒకరు మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం శాలిపేట చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం సత్యనారాయణ, శ్రీనివాస్, రాజు అనే ముగ్గురు అన్నదమ్ములు తమ భూమిలో పనులు చేస్తున్న క్రమంలో ఇదే గ్రామానికి చెందిన మూర్తి నారాయణతోపాటు ఆయన అన్నదమ్ములు వారి కుమారులు మొత్తం 9 మంది కలిసి భూవిదం నేపథ్యంలో సత్యనారాయణ, శ్రీనివాస్, రాజులపై దాడులు చేశారు. ఈ ఘటనలో సత్యనారాయణ, శ్రీనివాస్, […]</p>

దిశ, నర్సాపూర్: భూతగాదాలతో ముగ్గురు అన్నదమ్ములపై దాడి చేయడంతో ఒకరు మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం శాలిపేట చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం సత్యనారాయణ, శ్రీనివాస్, రాజు అనే ముగ్గురు అన్నదమ్ములు తమ భూమిలో పనులు చేస్తున్న క్రమంలో ఇదే గ్రామానికి చెందిన మూర్తి నారాయణతోపాటు ఆయన అన్నదమ్ములు వారి కుమారులు మొత్తం 9 మంది కలిసి భూవిదం నేపథ్యంలో సత్యనారాయణ, శ్రీనివాస్, రాజులపై దాడులు చేశారు.
ఈ ఘటనలో సత్యనారాయణ, శ్రీనివాస్, రాజులకు తీవ్ర గాయాలు కావడంతో నగరంలోని ఓ పైవేటు ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాస్, సత్యనారాయణలు చికిత్స పొందుతుండగా.. శ్రీనివాస్ మృతిచెందాడు. రాజు ఇదే గ్రామంలోని స్థానిక ఎంపీటీసీ వద్ద తలదాచుకున్నట్లు తూప్రాన్ డీఎస్‌పీ కిరణ్‌కుమార్ తెలిపారు. దాడికి పాల్పడిన ఆరుగురిని అదుపులోకి తీసుకొగా, మరో ముగ్గురు తప్పించుకొని పారిపోయారు. వారిని త్వరలోనే పట్టుకొనున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ కిరణ్‌కుమార్ చెప్పారు.






