- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెల్లెలి ప్రేమ వ్యవహారం.. నడి రోడ్డుపై అన్న దారుణ హత్య.?
by Batti.Sumithra |
<p>దిశ, తాండూరు : వికారాబాద్ జిల్లాలో గురువారం ఉదయం దారుణ ఘటన వెలుగుచూసింది. బషీరాబాద్ మండలంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బషీరాబాద్ నుంచి జీవన్గీ వెళ్లే రోడ్డు మార్గంలో ఉన్న పోచమ్మ దేవాలయం సమీపంలో మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ జుబెర్(25)ను గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి హత్య చేసినట్లు తెలుస్తోంది. హత్యా సమాచారం అందుకున్న సీఐ జలంధర్ రెడ్డి, ఎస్సై విద్యాచరన్ రెడ్డి హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఇదిలా […]</p>

X
దిశ, తాండూరు : వికారాబాద్ జిల్లాలో గురువారం ఉదయం దారుణ ఘటన వెలుగుచూసింది. బషీరాబాద్ మండలంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బషీరాబాద్ నుంచి జీవన్గీ వెళ్లే రోడ్డు మార్గంలో ఉన్న పోచమ్మ దేవాలయం సమీపంలో మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ జుబెర్(25)ను గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి హత్య చేసినట్లు తెలుస్తోంది.
హత్యా సమాచారం అందుకున్న సీఐ జలంధర్ రెడ్డి, ఎస్సై విద్యాచరన్ రెడ్డి హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఇదిలా వుండగా తన చెల్లిని అదే సామాజిక వర్గానికి చెందిన ఓ యువకుడు ప్రేమించాడని.. అయితే సదరు యువకుడు పెళ్లికి నిరాకరించడంతోనే రెండు కుటుంబాల మధ్య కక్షలు పెరిగినట్లు సమాచారం. ఈ క్రమంలోనే హత్య జరిగి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్యకు గల కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టినట్టు తెలిపారు.

- Tags
- murder
Next Story






