- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భార్యను చంపి… స్టోరీ చెప్పాడు
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్ డెస్క్: కడపజిల్లా కాశీనాయనలో దారుణం జరిగింది. భార్యను హత్య చేసి మూటకట్టి కాలువలో పడేశాడు ఓ భర్త. నాలుగురోజుల క్రితం భార్య నారాయణమ్మను ఆమె భర్త పుల్లారెడ్డి హత్య చేశాడు. భార్య కనిపించడం లేదని కట్టుకథ అల్లి పోలీసులకు చెప్పాడు. తన భార్య ఆచూకీ కనుక్కోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు పుల్లారెడ్డిపై నిఘాపెట్టారు. మిస్సింగ్ కేసు కాదని ముమ్మాటికీ హత్యేనని అనుమానించారు. ఆ కోణంలో దర్యాప్తు చేసిన పోలీసులు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: కడపజిల్లా కాశీనాయనలో దారుణం జరిగింది. భార్యను హత్య చేసి మూటకట్టి కాలువలో పడేశాడు ఓ భర్త. నాలుగురోజుల క్రితం భార్య నారాయణమ్మను ఆమె భర్త పుల్లారెడ్డి హత్య చేశాడు. భార్య కనిపించడం లేదని కట్టుకథ అల్లి పోలీసులకు చెప్పాడు. తన భార్య ఆచూకీ కనుక్కోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మిస్సింగ్కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు పుల్లారెడ్డిపై నిఘాపెట్టారు. మిస్సింగ్ కేసు కాదని ముమ్మాటికీ హత్యేనని అనుమానించారు. ఆ కోణంలో దర్యాప్తు చేసిన పోలీసులు భర్తే హంతకుడని గుర్తించారు. వెంటనే పుల్లారెడ్డిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. హత్యకు సంబంధించిన కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






