- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దాదాపై ‘దీదీ’ ఫైర్ !
<p>వన్డే సిరీస్‌లో భాగంగా టీమ్ ఇండియా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో ఆడాల్సిన రెండు వన్డే మ్యాచ్‌లు కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. మొదటి వన్డే వర్షం కారణంగా రద్దుకాగా.. లక్నో, కోల్‌కతాల్లో జరగాల్సిన చివరి రెండు మ్యాచ్‌లను మొదట ప్రేక్షకులు లేకుండానే నిర్వహించాలని బీసీసీఐ భావించిన్పటికీ సాధ్యపడలేదు. దీంతో వాయిదా వేయక తప్పలేదు. ప్రస్తుతం ఇదే విషయమై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని విమర్శించారు . ‘కోల్‌కతాలో మ్యాచ్ […]</p>

వన్డే సిరీస్‌లో భాగంగా టీమ్ ఇండియా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో ఆడాల్సిన రెండు వన్డే మ్యాచ్‌లు కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. మొదటి వన్డే వర్షం కారణంగా రద్దుకాగా.. లక్నో, కోల్‌కతాల్లో జరగాల్సిన చివరి రెండు మ్యాచ్‌లను మొదట ప్రేక్షకులు లేకుండానే నిర్వహించాలని బీసీసీఐ భావించిన్పటికీ సాధ్యపడలేదు. దీంతో వాయిదా వేయక తప్పలేదు.
ప్రస్తుతం ఇదే విషయమై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని విమర్శించారు . ‘కోల్‌కతాలో మ్యాచ్ నిర్వహించాలని నిర్ణయించినపుడు ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీకి గానీ, పోలీస్ కమిషనర్‌కు గానీ ముందే ఎందుకు చెప్పలేదు.. నిర్ణయం తీసుకున్నాక చెబితే ఎలా, మ్యాచ్‌ను ఆపాలని మేమేం చెప్పలేదు కదా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ప్రభుత్వ ఆదేశాలతో బీసీసీఐ దక్షిణాఫ్రికాతో సిరీస్‌ను వాయిదా వేసింది.
tags : BCCI, Ind Vs South Africa, Mamata Banerjee, Sourav Ganguly






