రేవంత్ విషయంలో కోమటిరెడ్డి తీరు సరికాదు: మల్లు రవి

by  |
రేవంత్ విషయంలో కోమటిరెడ్డి తీరు సరికాదు: మల్లు రవి
X

దిశ, తెలంగాణ బ్యూరో : టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అధిష్టానం ప్రజాస్వామ్య బద్ధంగా నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను తీసుకుందన్నారు. రోజుల తరబడి అందరితో చర్చించి ఏఐసీసీ ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రేవంత్ రెడ్డి నియామకం విషయంలో కోమటిరెడ్డి టీపీసీసీ ఇన్‌చార్జీ మణిక్కమ్ ఠాగూర్‌ను నిందించడం పార్టీ క్రమశిక్షణా రహిత్యమని పేర్కొన్నారు. ఏదైనా అభిప్రాయ బేధాలు ఉంటే పార్టీ అంతర్గతంగా చర్చించాలని సూచించారు. పార్టీ నిర్ణయానికి పార్టీ శ్రేణులు కట్టుబడి ఉండాల్సేందే అన్నారు.

Next Story