అందానికి అదృష్టం వరించేనా.. సూపర్ హిట్ దక్కేనా?

by  |
malavika sharma
X

దిశ, సినిమా: మోడల్‌గా కెరీర్ ప్రారంభించి ముంబై భామ మాళవికా శర్మ.. మలయాళ సినిమా ‘వైఫ్ ఆఫ్ డాక్టర్’ ద్వారా హీరోయిన్‌ అయింది. రవితేజ ‘నేల టికెట్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా, ఆ చిత్ర పరాజయం కారణంగా కాస్త గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత రామ్ పోతినేని ‘రెడ్’లో అవకాశం దక్కించుకోగా.. కొవిడ్ పాండమిక్‌లో రిలీజైన ఈ మూవీ విజయం సాధించినా తనకు మాత్రం స్టార్‌డమ్ దక్కలేదు. అయితే ‘రెడ్’ షూటింగ్ సమయంలోనే మాళవిక తన లా డిగ్రీ కంప్లీట్ చేయడం విశేషం.

https://twitter.com/ImMalvikaSharma/status/1383080700845256704?s=20

ఈ సంగతి పక్కనబెడితే, తాజాగా ఆమె ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన ఫొటోను చూసి అభిమానులు తెగ పొగిడేస్తున్నారు. అందంతో పాటు నటనా ప్రావీణ్యమున్న మాళవికకు సరైన పాత్ర లభిస్తే నెం.1 హీరోయిన్ అవుతుందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫొటో చూసైనా ఫిల్మ్ మేకర్స్ తనకు ఆఫర్స్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. బ్లాక్ అండ్ వైట్‌లో చైర్‌పై కూర్చొని ఉన్న మాళవికకు తప్పక అదృష్టం వరిస్తుందని, సూపర్ హిట్ సినిమాల్లో అవకాశాలొస్తాయని పోస్టులు పెడుతున్నారు.


Next Story

Most Viewed