ఆశకు పోతే ట్రాన్స్‌జెండర్‌గా మారడం ఖాయం

by  |
ఆశకు పోతే ట్రాన్స్‌జెండర్‌గా మారడం ఖాయం
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: ఇప్పటిదాకా డ్రగ్స్‌ సరఫరా, ఉమన్‌ అండ్‌ చిల్డ్రన్‌ ట్రాఫికింగ్‌, గ్యాంబ్లింగ్‌ లాంటి మాఫియాలను మనం విన్నాం.. చూశాం. కాని ఉమ్మడి నల్లగొండల జిల్లాలో ఓ ముఠా కొత్త దందాకు తెరలేపింది. పేదరికంతో బాధపడుతున్న యువకులకు డబ్బు సంపాదన ఆశ జూపి ట్రాన్స్‌జెండర్‌‌లుగా మార్చుతున్నారు. ముంబయి తీసుకెళ్లీ మరీ ఆపరేషన్ చేపిస్తూ ట్రాన్స్ జెండర్లుగా మార్చుతున్నారు. శరీరంలో మార్పుల కోసం స్టెరాయిడ్లు విపరీతంగా వాడటంతో కొందరు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి నల్లగొండలో జరుగుతున్న ట్రాన్స్ మాఫియాపై దిశ కథనం..

ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ట్రాన్స్ జెండర్ ముఠాలు రెచ్చిపోతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న ఈ ముఠాలు ఉమ్మడి జిల్లాలోని హుజూర్‌నగర్, సూర్యాపేట, మిర్యాలగూడ, కోదాడ, భువనగిరి, యాదగిరిగుట్ట వరకు విస్తరించాయి. ట్రాన్స్‌ జెండర్‌గా మారితే కలిగే ప్రయోజనాలను చూపి వారిని కృత్రిమంగా ట్రాన్స్ జెండర్లుగా మార్చుతున్నారు. ముఖ్యంగా పల్లెల్లో ఉంటున్న యువతను వీరు టార్గెట్ చేస్తున్నారు. ట్రాన్స్ జెండర్లుగా మారితే సులువుగా డబ్బు సంపాదించొచ్చని వారికి ఆశజూపుతున్నారు. కేవలం రెండు లక్షలతో ట్రాన్స్‌జెండర్‌గా మారొచ్చని వారిని నమ్మిస్తున్నారు. వారి వలలో చిక్కిన వారిని ముంబయికి తీసుకెళ్లి ఆపరేషన్లు చేయిస్తున్నారు. స్టెరాయిడ్స్‌ ఇచ్చి భౌతికంగా శరీరంలో కొన్ని మార్పులు జరిగేలా చేస్తున్నారు. స్టెరాయిడ్స్‌ విపరీతంగా వాడటంతో కొందరు అనారోగ్యాల పాలై మంచం పట్టిన వారు కూడా ఉన్నారు. ఏం జరిగిందో ఎవరికీ చెప్పుకోలేని దుస్థితిలో కాలం వెళ్లదీస్తున్నారు.

ముంబయి తీసుకెళ్లి ఆపరేషన్..

యుతను మాటలతో మభ్యపెట్టి మొల్లగా ఈ దందాలో దించుతారు. వారిని ట్రాన్స్ జెండర్లుగా మార్చేందుకు ఈ మాఫియా ముఠాలే ఖర్చులు భరించి ముంబయికి తీసుకెళ్లి ఆపరేషన్ చేయిస్తారు. వారికి సౌందర్య సాధనాలు, స్టెరాయిడ్స్‌. ఇందుకు అయ్యే ఖర్చుకోసం వెతుక్కునే పరిస్థితి లేకుండా ఇంతకు ముందు ఆపరేషన్ చేయించుకున్నవారే సమకూర్చుతారు. ఆపరేషన్లు చేయించి, లింగ మార్పిడి అనంతరం స్త్రీల మాదిరి తయారు చేయడానికి ఈ ముఠా సభ్యులు పెద్ద ఎత్తున నిధులను సమకూర్చుకుంటున్నారు.

సానుభూతి అడ్డు పెట్టుకుని..

ట్రాన్స్‌జెండర్ల పట్ల సమాజంలో ఉన్న సానుభూతి కోణాన్ని అడ్డుపెట్టుకుని కొందరు వసూళ్లకు పాల్పడుతున్నారు. దీంతో అసలైన ట్రాన్స్‌జెండర్లు నెపం మోయాల్సిన దుస్థితి దాపురించింది. ఎవరు అసలో ఎవరు నకిలీనో తెలియని పరిస్థితి నెలకొంది. ఇటీవల నకిలీ ట్రాన్స్‌‌జెండర్‌ ఒకరు హుజుర్‌నగర్ మార్కెట్‌లో డబ్బు వసూలు చేస్తుండగా ఆ మార్కెట్‌లో తిరిగే అసలైన ట్రాన్స్‌జెండర్లు పట్టుకుని అతన్ని చితకబాదారు. అంతటితో ఆగకుండా ఆ నకిలీ ట్రాన్స్‌ జెండర్‌కు గుండు కొట్టించారు. ఈ ట్రాన్స్ జెండర్ మాఫియా వల్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా పర్‌ఫెక్ట్‌గా ఆర్గనైజ్డ్‌గా చేస్తున్న ఈ దందాను పోలీసులు ఛేదించాల్సి ఉంది.

Next Story